తరుణ్ భాస్కర్ తరువాత సినిమా ఈ హీరోతోనే

Tharun Bhascker's Cryptic Post on Superstar Turns Uglyనిన్న టాలెంటెడ్ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ విక్టరీ వెంకటేష్‌తో తన ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఇప్పుడు జరగడం లేదని పత్రికా ముఖంగా ప్రకటించాడు. అతను తన ఇతర ప్రాజెక్టుకు ఒక స్టార్ హీరోతో కలిసి ఒక క్రైమ్ థ్రిల్లర్ రూపొందించనున్నట్టు వెల్లడించాడు. అతను హీరో పేరును వెల్లడించలేదు. అది మరెవరో కాదని యువ సామ్రాట్ నాగ చైతన్య అని మేము విశ్వసనీయంగా తెలుసుకున్నాము.

చైతన్య మేనమామ సురేష్ బాబు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో వస్తుంది. తరుణ్ కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాడు. లాక్ డౌన్ లో దాదాపుగా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. నాగ చైతన్య ఇటీవల తన లవ్ స్టోరీ షూటింగ్‌ను ముగించారు.

ADVERTISEMENT

అయితే మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ గురించి స్పష్టత లేదు. ముందుగా అతను మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో థాంక్యూ అనే చిత్రం షూటింగ్ మొదలుపెడతాడు. ఆ తరువాతే తరుణ్ భాస్కర్ సినిమా పట్టాలెక్కుతోంది. వచ్చే ఏడాది రెండో భాగంలో గానీ ఆ సినిమా మొదలయ్యే అవకాశం లేదు.

దీనితో తరుణ్ కు స్క్రిప్ట్ పక్కాగా చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. తన మొదటి సినిమా పెళ్లిచూపులు తో పెద్ద హిట్ కొట్టిన తరుణ్ ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే యావరేజ్ సినిమా చేశాడు. ఈ మూడవ సినిమాతో ఇంకో పెద్ద హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.

ADVERTISEMENT
Latest Stories