Telugu

అది రఫెల్ కాదు మిత్రమా.. డ్రోన్!

ఆపరేషన్ సింధూర్‌ పేరుతో భారత్‌ వాయుసేన దాడి చేసినప్పుడు పాక్‌ సైన్యం ధీటుగా తిప్పి కొట్టిందని, భారత్‌కు చెందిన 5 యుద్ధ విమానాలు కూల్చేశామని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ చెప్పారు. వాటిలో అత్యాధునికమైన రఫెల్ యుద్ధ విమానం కూడా ఒకటని చెప్పారు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సీఎన్ఎన్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “మీ సైన్యం కూల్చేసిన భారత్‌ యుద్ధ విమాన శకలాలు చూపగలరా?” అని ప్రశ్నించేసరికి ఆయన చెప్పిన జవాబు విని అందరూ నవ్వుకోక తప్పదు.

ADVERTISEMENT

“సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వస్తున్నాయి కదా? అదీ భారత్‌ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి.. చూడొచ్చు..” అని అన్నారు.

“సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా పరిగణించలేము. మీ వద్ద మరేమైనా సాక్ష్యాధారాలున్నాయా?” అని ‘సీఎన్ఎన్’ ప్రతినిధి అడిగేసరికి ఆయన జవాబు చెప్పలేక తడబడ్డారు.

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత భారత్‌ ఆ ఫోటోలు, వీడియోలు, పాక్‌లో దాడి చేసిన ప్రాంతాలను, అవి సరిహద్దుకి ఎంత దూరంలో ఉన్నాయో వంటి అన్ని వివరాలు మీడియా ముందుంచింది. ఆపరేషన్ సింధూర్‌ ఏవిదంగా చేశామో ఇద్దరు మహిళా అధికారుల చేత మీడియాకు బ్రీఫింగ్ చేయించింది.

కానీ పాక్‌ రక్షణ మంత్రి సోషల్ మీడియాలో ఫోటోలున్నాయని చెప్పడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

ఈరోజు ఉదయం పాకిస్థాన్‌లో వాల్టన్ విమానాశ్రయం సమీపంలో ఓ భారతీయ డ్రోన్‌ని కూల్చేశామని పాక్‌ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు అవతల నుంచి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

ఆ సమయంలో సైరన్ మ్రోగుతుండగా తీసిన ఓ వీడియోని, దానిలో కూల్చేసిన డ్రోన్‌ని చూపారు. కానీ అది భారత్‌కు చెందినదే అని నిరూపించే ఆధారం చూపలేదు!

తమ రక్షణ మంత్రి 5 భారత్‌ యుద్ధ విమానాలను కూల్చేశారని చెప్పుకుంటున్నారు… దానిలో ఓ రఫెల్ కూడా ఉందన్నారు.. కనుక పాక్‌ పోలీసులే ఓ డ్రోన్ ఎగురవేసి కూల్చేసి అదే రఫెల్ అని అనుకోమంటున్నారేమో?

అయినా భారత్‌ మిలటరీ ఆపరేషన్ చేపడితే ఇలాంటి చిల్లర పనులు చేయదని గతంలో సర్జికల్ స్ట్రైక్, తాజాగా ఆపరేషన్ సింధూర్‌తో నిరూపించి చూపింది కదా? ఇంకా రఫెల్, డ్రోన్ డ్రామాలు దేనికో?

మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈవిదంగా ప్రగల్భాలు, అబద్దాలు చెపుతూ, ఇలాంటి చిల్లర డ్రామాలు చేస్తుంటే అది చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటాయనే ఇంగితం కూడా లేకపోతే ఎలా?

ఇటువంటి పాలకులు, ఇటువంటి మిలటరీ చేతిలో ఉన్న పాకిస్థాన్‌ దేశం, ఆ దేశ ప్రజలని చూసి జాలిపడక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

19 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

49 minutes ago