జగన్‌ నిర్వాకాలు కనిపెట్టడమే పెద్ద పని!

రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 36,000 ఎకరాలు భూమి సమీకరించారు. కానీ దానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టిడిపి నేతలు వారి బినామీల పేరుతో వేల ఎకరాలు కొనుగోలు చేశారని జగన్‌ ఆరోపించేవారు. కనుక అధికారంలోకి రాగానే అమరావతిపై కమ్మ ముద్ర వేసి పక్కన పడేసి మూడు రాజధానులు, విశాఖ రాజధాని పేరుతో 5 ఏళ్ళు కాలక్షేపం చేసి దిగిపోయారు.

అమరావతిలో టిడిపి అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్‌, వైసీపి నేతలు ఆ ప్రాంతంలోనే దాదాపు 25,000 ఎకరాల 22ఏ, ఎసైన్ భూములు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. వాటి కోసం గ్రామాలలో ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారు కూడా.

ADVERTISEMENT

సిఎం చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇకపై ఆ భూముల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాదు… గత 5 ఏళ్ళలో ఈ చుక్కల భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపించాలని నిర్ణయించారు.

గ్రామసభలు నిర్వహించి ఏయే గ్రామాలలో ఎంత భూమి, ఎవరెవరి భూములు దౌర్జన్యంగా లాక్కొనబడ్డాయో, ఈవిదంగా రిజిస్ట్రేషన్లు జరిగాయో మూడు నెలల్లోగా విచారణ జరిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

అమరావతిలో భూదోపిడీతో వైసీపి నేతలు సంతృప్తి చెందలేదు. విశాఖ రాజధాని పేరుతో విశాఖ జిల్లాతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలో, అటు అనకాపల్లి నుంచి తూర్పు గోదావరి జిల్లా వైపు ఎక్కడికక్కడ భూకబ్జాలు చేశారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 2024 ఎన్నికలలో వైసీపిని గద్దె దించకపోయి ఉండి ఉంటే, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల భూములన్నీ వారి అధీనంలోకి వెళ్ళిపోయి ఉండేవి.

ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి, ఇన్నివేల ఎకరాలు భూకబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుని, అమరావతిని పాడుబెట్టినా జగన్మోహన్‌ రెడ్డి ఇంకా నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, విలువలు అంటూ ధర్మపన్నాలు చెపుతుండటం గమనిస్తే, ఇటువంటి మాటలతో రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్యపెట్టవచ్చని నమ్ముతున్నట్లే ఉన్నారనుకోవచ్చు.

జగన్‌ని ఓడించినా ఆయన పాలనలో జరిగిన ఇటువంటి దారుణాలన్నిటినీ ఒక్కొక్కటీ కనుగొని, వాటిపై విచారణ జరిపించి, నష్ట నివారణ చర్యలు చేపట్టడమే సిఎం చంద్రబాబు నాయుడుకి పెద్ద పనిగా మారింది.

అమరావతిని శుభ్రపరచడం, సర్వే రాళ్ళు, పాసు పుస్తకాలు, స్కూలు పుస్తకాలు, డాక్యుమెంట్లపై జగన్‌ బొమ్మలు తొలగించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపి రంగులు, జగన్‌ బొమ్మలు తొలగించడం వంటి పనులకే సమయం, బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. అంటే జగన్‌ అధికారంలో లేకపోయినా రాష్ట్రానికి ఇంకా నష్టం కలిగిస్తూనే ఉన్నారన్న మాట! అందుకే ప్రజలు తనని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

23 minutes ago

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

5 hours ago