మార్పు మొదలయ్యింది…బాబు ఈజ్ బ్యాక్..!

వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా చేసిన తప్పిదాలను ఒక కేస్ స్టడీ మాదిరి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే తమ పార్టీ నాయకులకు హిత బోధ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా వైసీపీ నేతలు చేసిన అహంకార పూరిత ప్రవర్తనను చూసి విసిగిపోయిన ప్రజలు వైసీపీ కి కేవలం 11 సీట్లు ఇచ్చి అథః పాతాళానికి తొక్కారు.

దీనితో అధికారం చేతిలో ఉంటే నాయకులు ఎలా ప్రవర్తించకూడదో ప్రవర్తించి చూపించారు వైసీపీ నేతలు. అయితే ప్రభుత్వాలు మారాయి పాత సంస్కృతులు మారాలి అంటూ బాబు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. బాబు అధికారంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులైన, అధికారులైనా, చివరికి పార్టీ శ్రేణులైన అందరు చటానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

కడప జిల్లా నుండి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత రెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చ నియాంశం అయ్యింది.
రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ మంత్రి భార్య హరిత పోలీసుల పై దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటన మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై స్పందించారు బాబు.

స్వయంగా మంత్రి రాం ప్రసాద్ కు ఫోన్ చేసి జరిగిన ఘటన పై వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టం చేసారు. ఇటువంటి చర్యలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకు వస్తుందని, పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరి మీద ఉందంటూ హెచ్చరించారు. మంత్రి రామ్ ప్రసాద్ కూడా జరిగిన ఘటన పై సందిస్తూ విచారణ వ్యక్తం చేసారు.

తన సొంత పార్టీ కుటుంబ సభ్యులైన ఉపేక్షించకుండా తప్పును తప్పుగా భావించి మంత్రి కుటుంబానికి తగిన ఆదేశాలు ఇచ్చిన బాబు పనితీరు పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు తప్పులు చేసి మీడియా కు అడ్డంగా దొరికి పోయిన వారిని వారు చేసిన తప్పులను వెనకోసుకొచ్చి తన పతనానికి తానే కరాంమయ్యారు జగన్. అయితే బాబు మాత్రం ఆ పొరపాటు చేయకుండా తమ పార్టీ నేతలైన హద్దులు దాటితే చర్యలు తప్పవనే సంకేతం పంపారు.

ఒకపక్క బాబు,పవన్, లోకేష్ లు పరదాలు పక్కన పెట్టి ప్రజలకు జవాబుదారిగా ఉంటూ సామాన్యుడు మాదిరి ప్రజలలో కలిసిపోతుంటే పార్టీ నేతలు మాత్రం ఆ ఆనవాయితీని కొనసాగించకుండా ఆడంబరాలకు పోతూ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటూ వైసీపీకి అవకాశం ఇవ్వడం దురదృష్టకరం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘వంగవీటి’ బ్రాండ్ నేమ్ జనసేన కు మరింత బలం కానుందా.?

ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల సైరన్ తో రాష్ట్ర రాజకీయాలలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజకీయాలకు…

9 minutes ago

Pan-India Craze: Telugu Stars Ignoring a Huge Fan Base?

Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…

29 minutes ago