ప్యారడైజ్ ములాఖాత్: హిట్ అని రుద్దుడైతే లేదు

Nani at The Paradise Media Mulakat

ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన ప్యారడైజ్ మీడియా ములాఖాత్ ఒక మంచి థీసిస్ లాంటిది. ప్రెస్ మీట్ లో ఎక్కడా, ఏ పోస్టర్ మీదా కూడా ఫలానా హిట్, ఫలానా బ్లాక్ బస్టర్ అనే పదాలు కనిపించలేదు. సింపుల్ గా ఇన్ సినిమాస్ నవ్ అని మాత్రమే కనిపించింది. నాని అండ్ టీమ్ నుండి ఇదైతే మంచి గెస్చర్. అలాగే ఈ మీట్ ని నిర్వహించిన విధానం కూడా అలరించింది. ముఖ్యంగా సినిమాకి ఆడియన్స్ లో ఉన్న రెస్పాన్స్ ని యాక్సెప్ట్ చేసిన తీరు.

మోహన్ బాబు “నీకెందుకు” అని ప్రశ్నించిన విధానం కఠినంగానే ఉన్నా.. నిజంగానే సెట్లో జరిగిన విషయాల గురించి మీడియా లేదా ఆడియన్స్ కి అవసరమా? అంటే దానికి సరైన సమాధానం మాత్రం లేదు.

ADVERTISEMENT

ఇక నాని మాట్లాడుతూ ఆడియన్స్ రెస్పాన్స్ మరియు ట్రోల్స్ ని యాక్సెప్ట్ చేసిన తీరు ప్రశంసార్హం. అదే సందర్భంలో శ్రీకాంత్ ఓదెల మాటలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. భవిష్యత్తులో నాని-శ్రీకాంత్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని చెప్పడం మరో విశేషం.

చాలా విషయాలకి క్లారిటీ ఇచ్చారు, ఇంకొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అయ్యింది. హీరోయిన్ ఈవెంట్ కి వచ్చి ఉంటే బెటర్ గా ఉండేది. అన్నిటికీ మించి మైత్రి శశి మేం సేఫ్ అని చెప్పడం మెయిన్ హైలైట్ గా మారింది. మరో ఈవెంట్ ఉండదు అని కూడా నాని ఇండైరెక్ట్ గా చెప్పాడు.

హిట్ సినిమా అని రుద్దకుండా, రెస్పాన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ నిర్వహించిన ప్యారడైజ్ సక్సెస్ మీట్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఇండస్ట్రీ వర్గాలు.

ADVERTISEMENT
Latest Stories