ప్యారడైజ్ ప్రీరిలీజ్: సుమ & రాఘవ్ హిట్, హైప్ మిస్!

Nani at The Paradise pre-release event

సాధారణంగా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో హీరోలు లేదా దర్శకులు ఇచ్చే స్టేట్మెంట్స్ బట్టి సినిమా హైప్ పెరగడం, తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అయితే.. నిన్న రాత్రి జరిగిన ప్యారడైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాత్రం ఏమాత్రం హైప్ కనిపించలేదు. నాని మాటల్లో ఎక్కడో మునుపటి సినిమాల విషయంలో కనిపించినంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు.

అయినా.. ఈమధ్యకాలంలో సినిమా దర్శకులు పోస్ట్ ప్రొడక్షన్ లేదా కంటెంట్ డెలివరీ అంటూ రకరకాల కారణాలు చెప్పి, ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి హాజరుకాకపోవడం అనేది సినిమాకి మైనస్ గా మారుతుంది. నిన్న ప్యారడైజ్ ఈవెంట్ లోనూ ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. అసలే ట్రైలర్ లేదు.. కనీసం ప్యారడైజ్ ప్రపంచం ఎలా ఉంటుందో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చినా బాగుండేది. అలాంటిది అతడే రాకపోవడంతో ఓ రొటీన్ ఈవెంట్ లా మిగిలిపోయింది.

ADVERTISEMENT

కాకపోతే.. విలన్ గా కనిపించనున్న రాఘవ్ జుయాల్ ఎనర్జీ, సుమతో కలిసి వేసిన డ్యాన్స్ స్టెప్పులు మాత్రం ఆడియన్స్ ను, నెటిజన్స్ ను విశేషంగా అలరించాయి. అయితే.. అది సినిమాకి ఉపయోగపడుతుందా అంటే కాదనే చెప్పాలి. అతడి డ్యాన్స్ & ఈజ్ అనేది ఒక వ్యక్తిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది అంతే.

ఊహించని విధంగా దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాని ప్రస్తావించి, పవన్ కళ్యాణ్ పెండింగ్ 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదు అని చెప్పడం వైలర్ అయ్యింది. నిర్మాత సుధాకర్ మొహమాటంతో మాట్లాడలేదు, నాని ఏమో చాలా సేఫ్ గా, ఎలాంటి బ్లేమ్ గేమ్ లేకుండా సింపుల్ గా స్పీచ్ కానిచ్చేశాడు. హీరోయిన్ స్టేజ్ మీద కూడా శ్రీకాంత్ పనితనాన్ని వేలెత్తిచూపింది. ఈవెంట్ మొత్తంలో యాంకర్ సుమ టైమింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే.. మిగతా అంతా ఎంత పలుచగా జరిగిందో ఊహించుకోవచ్చు.

24వ తారీఖు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నాని మీద ఉన్న నమ్మకంతో మొదటి రోజు బుకింగ్స్ బాగానే ఫుల్ అవుతున్నాయి. ప్రీమియర్స్ ఓపెన్ అయ్యాక ఎలాగో అవన్నీ ఫుల్స్ అయిపోతాయి. ప్రీమియర్ టాక్ & కంటెంట్ బట్టి వీకెండ్ రన్ ఎలా ఉంటుంది అనేది స్పష్టమవుతుంది. మరి ప్యారడైజ్ టీమ్ ప్రీమియర్స్ తో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories