
మెగాస్టార్ చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవికి చిన్నతనం నుంచి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. అలాగే చిరంజీవి దోశలను కూడా ఇష్టంగా తింటారు. ‘చిరంజీవి దోశ’ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
బాలయ్య బాబు :
బాలయ్య బాబు విషయానికి వస్తే.. ఆయన రొయ్యలను బాగా ఇష్టపడతారు. చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్. అయితే, ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి ఉన్న అలవాటు.
విక్టరీ వెంకటేష్ :
వెంకటేష్ నోస్టాల్జిక్ కీమాను ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాల్జిక్ కీమాను తినడం వెంకటేష్ బాగా లైక్ చేస్తారట.
కింగ్ నాగార్జున :
ఆరు పదుల వయసులో కూడా నాగార్జున పెర్ఫెక్ట్ ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తున్నాడు. నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.
రెబల్ స్టార్ ప్రభాస్ :
ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ ఏమిటో తెలుసా ? బిర్యానీ అట. అలాగే, సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పానీపూరీని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు :
మహేష్ వాళ్ళ అమ్మమ్మ గారు చేసే ప్రతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే, ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు. అలాగే, పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.
జూనియర్ ఎన్టీఆర్ :
జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటీ, నాటుకోడి ఖీమా. అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ :
చరణ్ కూడా బిర్యానీనే ఇష్టపడతారు. అలాగే చిరంజీవి దోశని కూడా చరణ్ ఇష్టంగా తింటాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ :
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరేట్. అయితే, బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటాడు.
Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…
ప్రధాని మోడీ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ఆటంబాంబు లాంటి మాట చెప్పారు. కనీసం ఒక ఏడాది…