రామ్ చరణ్ అభిమానులకు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

This is the day for Ram Charan fans that will never come againమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు 36వ పడిలోకి ఎంటర్ అవుతున్నాడు. సహజంగా ఒక స్టార్ బర్త్ డే అంటే అతనికి సంబంధించిన సినిమాల హడావిడి ఉండటం మాములే. ఈ సారి రామ్ చరణ్ అభిమానులకు అటువంటి అవకాశాలు ఏకంగా మూడు ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి అతని అల్లూరి లుక్ విడుదల అయ్యింది.

ఇది వరకు వచ్చిన టీజర్ లో కొంచెం సినిమాటిక్ అల్లూరిగా ఉండగా… ఈ సరికొత్త పోస్టర్ లో రామ్ చరణ్ కండలు తిరిగి మనకు తెలిసిన మన్యం వీరుడిగా కనిపించాడు. ఇక రేపు ఆచార్య సినిమా నుండి సిద్ధ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. కొరటాల ఈ పోస్టర్ తో మెగా అభిమానులను ఒక ఊపు ఊపడం ఖాయమని అంటున్నారు.

ADVERTISEMENT

ఇక మూడవది… రామ్ చరణ్ – శంకర్ సినిమా. అయితే ఈ సినిమా చాలా ఎర్లీ స్టేజిలో ఉంది కాబట్టి. పోస్టర్ వంటివి కష్టం. అయితే ఏదో ఒక అప్ డేట్ ఇవ్వకుండా ఉంటారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఒక హీరో అభిమానులకు బర్త్ డే సందర్భంగా ఇన్ని స్పెషల్స్ రావడం కూడా ఒక స్పెషల్ అనే చెప్పుకోవాలి.

ఇది ఇలా ఉండగా…. ఆచార్య మే 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల అవుతుంది. మే నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసి రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ఆలోచనగా ఉంది. ఆ సినిమా విడుదల మీద ఇంకా క్లారిటీ లేదు.

ADVERTISEMENT
Latest Stories