
గత కొన్ని రోజులుగా తోపుదుర్తి కేంద్రంగా వైసీపీ – టీడీపీ మధ్య జరుగుతున్న రాజకీయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తన కారును టిప్పర్ గుద్దబోయిందని, ఇది తన పై జరిగిన హత్యాయత్నమే అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలతో మొదలైన ఇరు వర్గాల రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.
అయితే తన పై జరిగిన ఈ దాడి వెనుక టీడీపీ కీలక నేత, పరిటాల కుటుంబం హస్తముందని అనేది ప్రకాష్ రెడ్డి ఆరోపణ. తన పై జరిగిన ఈ హత్యాయత్నం పై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాల్సిన పోలీసులు తన పై కేసులు నమోదు చేస్తున్నారంటూ ప్రకాష్ తనను ఒక బాధితుడిగా పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనపై స్పందించిన రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు తోపుదుర్తి చేస్తున్న హత్యారోపణలు పూర్తిగా రాజకీయ నాటకమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, చట్టం ముందు అందరు సమానులే, దర్యాప్తు పూర్తయితే దోషులెవరో తేలుతుందంటూ ప్రకాష్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు.
అలాగే తోపుదుర్తి తన పై చేసిన ఆరోణలు నిరూపించకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తా అంటూ ఎంఎస్ రాజు చేసిన ప్రకటన ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒకవేళ అన్నట్టుగానే టీడీపీ క్యాడర్ తన ఇంటి పైకి వస్తే వారి పై దాడి చేసేందుకుగాను తన ఇంటి లోపల గులకరాళ్ళ గుట్టలు ఏర్పాటు చేసారు.
అలాగే ఖాళీ బీర్ బాటిల్ సీసాలు, ఇనుపరాడ్లు…ఇలా ఘర్షణ పేరుతో హింసకు అవసరమైన సరంజామా మొత్తాన్ని తన ఇంటిలో నిక్షిప్తం చేసుకున్న వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో వైసీపీ ప్రకటిస్తున్న రప్ప రప్ప రాజకీయాలు ఇవేనా అంటూ కామెంట్స్ వినిపడుతున్నాయి.
ఒక వేళ టీడీపీ శ్రేణులు తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తే అందుకు వారి పై దాడి చేసేందుకు ఇటువంటి ప్రమాదకరమైన వస్తువులను పోగుచేసుకుంటారా.? చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని రాష్ట్రంలో అల్లర్లు సృటించాలని వైసీపీ భావిస్తుందా.? అందుకే ముందస్తు ప్రణాళిక ప్రకారం గులకరాళ్ళ గుట్టలు పోగేసుకుందా.?
ఒకవేళ ఇటువంటి ఘర్షణలతో ఎవరికైనా జరగరానిది జరిగితే ఇక అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం లో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఇటు ప్రభుత్వాన్ని ఇటు పోలీస్ వ్యవస్థను నిందించడం వైసీపీ కుట్ర రాజకీయంలో భాగమా.? జగన్ 2.0 అధికారంలోకి వస్తే వైసీపీ చెపుతున్న రప్ప రప్ప రాజకీయాలకు తోపుదుర్తి ఇంటి పరిసరాల ప్రాంగణం ప్రత్యక్ష ఉదాహరణా.?
ఈరోజు వాడో మనమో తేల్చుకోవాలి..
పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాటుకుని.
కార్యకర్తలందరూ మా ఇంటి దగ్గరికి రండి.
నేను ఎదురు చూస్తుంటా.
– తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి pic.twitter.com/i7hqHyXyHK
— Anitha Reddy (@Anithareddyatp) July 9, 2026
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…