
సామాన్యులకే కాదు ఒక్కో సందర్భంలో సెలబ్రెటీలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, అధికార పార్టీ నేతలకు సైతం బెదిరింపులు, హెచ్చరికలు సహజమే. అయితే తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి కి కూడా ఈ తరహా బెదిరింపు రావడంతో పోలీసులను ఆశ్రయించారు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్.
చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి తమకు ఈ బెదింపు కాల్స్ వచ్చాయంటూ ఫిర్యాదులో పేర్కొన్న ప్రసాద్, శేఖర్ తో తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని కూడా బయటపెట్టారు. గతంలో విజయశాంతి బీజేపీ లో ఉన్నప్పుడు శాంతి సోషల్ మీడియా ఖాతాలను రెడ్డి హ్యాండిల్ చేసేవారు.
అయితే ఈ అవకాశాన్ని రెడ్డి దుర్వినియోగం చేయడం తో ఆయనను పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఆ ఘటనతో గతంలోనూ తమ పై ఈ రకమైన ఆర్థిక బెదిరింపులకు రెడ్డి పాల్పడినట్టు శాంతి దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదే తరహాలో తనకు బకాయిలు ఉన్న డబ్బు మొత్తం చెల్లించాలంటూ మెసేజ్ లు పెట్టేవాడిని, అయితే రెడ్డి తమకు చేసిన పనులకు గాను తనకు చెల్లించాల్సిన మొత్తం అప్పుడే పూర్తిగా చెల్లించేశామని అయినా కూడా రెడ్డి మళ్ళీ మళ్ళీ తనకు డబ్బులు కావాలంటూ శాంతిని వేధిస్తుండడంతో ఈ విషయం కేసులు దాకా వెళ్లాల్సి వచ్చిందన్నారు.
అయితే రెడ్డి ద్వారా వచ్చే ఈ మెసేజ్ లు అభ్యంతర కరంగా ఉండడంతో శాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి అతని పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అయితే అధికార పార్టీలో ఎమ్మెల్సీ గా ఉన్న వ్యక్తికి సైతం ఈ తరహా బెదిరింపులు రావడంతో సదరు చంద్రశేఖర్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు అధికారులు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…
Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…