ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరి దృష్టి ఉన్న మూడు సినిమాలు వారణాసి, రామాయణ్, రాకా. మూడు కూడా విభిన్నమైన జోనర్ సినిమాలు. వారణాసి ఫాంటసీ యాక్షన్ ఫిలిం కాగా, “రామాయణ్” మంచి డివోషనల్ డ్రామా, “రాకా” సూపర్ హీరో ఫిలిం. ఈ మూడు సినిమాలకి ఒక కామన్ పాయింట్ ఉంది అదే.. గ్రాఫిక్స్ & వీఎఫెక్స్.
వారణాసి విషయంలో రాజమౌళి, రాకా విషయంలో అట్లీ, రామాయణ్ కోసం నమిత్ & నితీష్ లు గ్రాఫిక్స్ మీద గట్టిగానే ఆధారపడ్డారు. రాజమౌళి అనౌన్స్మెంట్ వీడియోతోనే సినిమా ఏస్థాయిలో ఉండబోతోంది అనేది క్లారిటీ ఇవ్వగా, రీసెంట్ గా రిలీజైన రామాయణ్ టీజర్ మాత్రం కాస్త నెగిటివ్ టాక్ ఫేస్ చేసింది, ఇక “రాకా”కి సంబంధించిన విజువల్స్ ఏమీ రాలేదు కాబట్టి, ఆ సినిమా రేంజ్ ఏమిటి అనేది తెలియకపోయినా.. అనౌన్స్మెంట్ టైంలో చూపించిన స్టూడియో కొలాబరోషన్స్ తోనే అంచనాలు పెంచేశాడు అట్లీ.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఈమధ్యకాలంలో ప్రతి ఆల్మోస్ట్ అన్నీ సినిమాలు ఏదో ఒక సన్నివేశం కోసం AIని అడ్డగోలుగా వాడేస్తుండగా.. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం AIని పక్కన పెట్టి, పూర్తిస్థాయిలో CGI & VFX మాత్రమే సినిమాల కోసం వినియోగిస్తుండడం ప్రశంసార్హం.
మూడు ప్యాన్ ఇండియన్ సినిమాలే, అన్నీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ సినిమాలన్నీ ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసేవే. సో, వరల్డ్ క్లాస్ ఆడియన్స్ అందరి దృష్టి ఈ సినిమాల మీద ఉంటుంది. రాజమౌళి, అట్లీ, నమిత్-నితీష్ లు ఏమాత్రం జాగ్రత్తగాలేకపోయినా గ్లోబల్ గా పరువు పోతుంది. వేల కోట్ల రూపాయలతో వీళ్లు ముగ్గురు చేస్తున్న రిస్క్ మంచి రిజల్ట్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం.




