
దేశంలో వందలాది మంది హిందూమతం పరిరక్షకులమని చెప్పుకునే స్వామీజీలు, పీఠాధిపతులు, బాబాలులున్నారు. హిందూమతం గొప్పదనాన్ని సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో చక్కగా వివరించే , ప్రవచన బ్రహ్మలున్నారు.
కానీ తిరుమల కల్తీ నెయ్యిపై ఏపీలో ఇంత వివాదం జరుగుతుంటే ఏ ఒక్కరూ మాట్లాడేందుకు ముందుకు రాలేదని ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి అన్నారు.
కానీ కల్తీ నెయ్యిని వాడించి తిరుమల ప్రతిష్టని భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన వైసీపీ నేతలను వారి అధినేత జగన్మోహన్ రెడ్డిని సమర్ధిస్తూ పలువురు హిందూ మేధావులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
సున్నితమైన ఈ అంశంపై రిపబ్లిక్ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హిందూ మేధావుల తీరుని అర్నబ్ గోస్వామి తప్పు పట్టారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేయడాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? రకరకాల రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమల ప్రసాదంలో వాడటం నిజమా కాదా? నిజమైతే అది తప్పని ఒప్పుకోకుండా ఎందుకు వితండ వాదనలు చేస్తున్నారు?
క్రీస్టియన్ మతానికి చెందిన జగన్ అతని అనుచరులు హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలతో ఎందుకు ఆటలాడుతున్నారు? అదే… ఎవరైనా తన మత విషయాలలో జోక్యం చేసుకుంటే సాహిస్తారా? సమర్ధిస్తారా?అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
సోషల్ మీడియాలో ‘జర్నీ విత్ జోగు’ హ్యాండిల్‌తో వివిధ అంశాలపై తన అభిప్రాయలు వ్యక్తం చేస్తే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఈ అంశంపై చేసిన కొన్ని ట్వీట్స్ చూసినప్పుడు నిజమే కదా అనిపించక మానదు.
“కల్తీ మాఫియా ఒక పవిత్రమైన దేవాలయాన్ని కూడా వదల లేదంటే, కల్తీ వ్యాపారం ఎంత విస్తారంగా సాగుతుందో ఆలోచించాలి. హోటల్సు, రెస్టారెంట్లు ఎటువంటి పధార్ధాలు వాడుతున్నారు అనేది ఆలోచిస్తే భయం వేస్తుంది. ముఖ్యంగా ఆహార నియంత్రణ విభాగం ఏ మేరకు పనిచేస్తుందనేది కూడా ప్రశ్నార్థకం.”
“స్వార్ధపరుడు చేయాలనుకున్నదే చేస్తాడు, కానీ భగవంతుడు జరగాలనుకున్నదే జరుగుతుంది.”
గత ఏడాది సికింద్రాబాద్ నుంచి బైక్‌పై వస్తున్నపాస్టర్ ప్రవీణ్ కుమార్ రాజమండ్రి సమీపంలో రోడ్ ప్రమాదంలో మృతి చెందితే వైసీపీ నేతలు, వారి మీడియా అది ప్రమాదం కాదు హత్య అంటూ రచ్చరచ్చ చేశారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, తిరుమల పవిత్రతని ఇంతగా దెబ్బ తీసిన జగన్ వైసీపీ నేతలు కలిసికట్టుగా కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తుంటే, హిందూమత రక్షక బాధ్యతలు తమవే అన్నట్లు చెప్పుకొని తిరిగే బిజేపి పెద్దలు, భజరంగ్ దళ్ వంటి సంస్థలు నోరు విప్పడం లేదు. ఎందువల్ల?చంద్రబాబు నాయుడు ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…