
అవును వైసీపీ చెపుతున్నట్టుగా జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి తయారీలో అసలు కల్తీనే జరగలేదు, ఎందుకంటే ఆ సమయంలో తిరుమల లడ్డు ప్రసాదంలో అసలు నెయ్యి అనే పదార్ధాన్నే వినియోగించలేదు అని సిట్ విచారణలో తేటతెల్లమయింది.
అసలు విషయానికొస్తే, గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందంటూ సీఎం బాబు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ వరకు వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే అటు వైసీపీ కూడా తన పై వచ్చిన విమర్శలకు అంతే తీవ్రంగా ప్రతిస్పందించిన సందర్భాలు చూసాం.
అయితే అసలు నెయ్యి కల్తీ జరిగిందా.? లేదా.? అనే విషయం తేల్చడానికి ప్రభుత్వం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేయడంతో దీని మీద విచారణ జరిపిన సిట్ ఇప్పటికే ఈ కల్తీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కొంతమందిని అరెస్టు చేసి కటకటాల వెనుకకు పంపింది.
అయితే తాజాగా ఈ కేసు విషయంలో సిట్ అధికారులు కోర్ట్ కు తెలియచేసిన అంశాలను పరిశీలిస్తే ఆ శ్రీ వారి భక్తులు వైసీపీ మాయలు ఈ రకంగా ఉంటాయా అన్నట్టుగా ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యి కాదని, పామాయిల్, ఇతర రసాయాలన వినియోగంతో నెయ్యి వంటి పదార్ధం తయారు చేసి దానిని టీటీడీ కి సరఫరా చేసారంటూ సిట్ కోర్టు కు తెలిపింది.
ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో తెరముందు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ కనిపిస్తున్నప్పటికీ అసలు కథ మొత్తం భోలే బాబా డైరీ ఆధ్వర్యంలోనే జరిగిందంటూ సిట్ బృందం ఒక అంచనాకు వచ్చింది. ఇదే విషయాన్ని అధికారుల బృందం న్యాయస్థానానికి వినిపించారు.
అయితే భోలే బాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ ఏఆర్, వైష్ణవి డైరీల సాయంతో బాబా డైరీ తెరచాటు వ్యవహారం నడిపించి టీటీడీ కి నెయ్యి కానీ నెయ్యి లాంటి పదార్ధాన్ని సరఫరా చేసింది.
అయితే ఈ కేసులో అరెస్టయిన నిందితులు మాత్రం తమకు బెయిలు కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సిబిఐ తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు మాత్రం వీరి బెయిలు ఇవ్వొద్దని, ఇటువంటి వారు బయటకొస్తే కేసులో సాక్ష్యులుగా ఉన్న వారిని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందంటూ వాదిస్తున్నారు.
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…