
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపి కొరివితో తల గోక్కున్నట్లే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని, కనుక సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరపాలని వైసీపి అభ్యర్ధించింది. అయితే దాంతో తమ గోతిని తామే తవ్వుకొంటున్నామని గ్రహించలేదు.
వైసీపి తరపున వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు కోరుకున్నట్లుగానే సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఓ స్పెషల్ సిట్ వేసింది.
దీనిలో ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరు పోలీస్ అధికారులు, ఎఫ్ఎస్ఏఈ నుంచి ఓ సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. స్వతంత్రంగా విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సిట్ సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది.
అంటే చిన్న సిట్ బదులు పెద్ద సిట్ ఏర్పాటైందన్న మాట! దానిలో ఇద్దరు సీబీఐ అధికారులకు, ఇద్దరు ఏపీ పోలీస్ అధికారులకు సుప్రీంకోర్టు చోటు కల్పిస్తుందని జగన్ ఊహించి ఉండరు. కనుక ఇది ఆయనకు మరో పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపి తమకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే, అది రాజకీయ కక్షపూరితంగా చేసిన కుట్ర అని వాదించేందుకు వైసీపికి అవకాశం ఉండేది. కానీ ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కనుక ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన్నట్లు నిర్ధారిస్తే వైసీపి దానిని కాదనలేదు. అంగీకరించాల్సిందే.
జగన్ హయాంలో తిరుమలకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయ్యిందని జాతీయస్థాయి ల్యాబ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కనుక ఇప్పుడు ఈ పెద్ద సిట్ విచారణలో నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే మొదట నష్టపోయేది జగన్ ఆ తర్వాత వైసీపియే.
ఒకవేళ నెయ్యి కల్తీ జరగలేదని సిట్ నివేదిక ఇచ్చినా సిఎం చంద్రబాబు నాయుడుకి, టిడిపి కూటమి ప్రభుత్వానికి ఏ నష్టం ఉండదు. కానీ వైసీపికి మాత్రం దాని క్లీన్ సర్టిఫికేట్ ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే వార్తలతో జగన్ హిందూ వ్యతిరేకి, తిరుమలలో అపచారం చేశారని యావత్ దేశ ప్రజలు నమ్ముతున్నారు కనుక. వారి అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరు కనుక. దాని వలన తనకీ, వైసీపికి జరిగిన నష్టాన్ని జగన్ ఎన్నటికీ సరిచేసుకోలేరు. పైగా ఇప్పుడీ పెద్ద సిట్ వలన మరింత నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పాపం జగన్… ప్రతీ వ్యూహం ఇలా బెడిసికొడుతుందేమిటో?
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…