అణుబాంబులా తిరుపతి లడ్డూ విస్పోటనం… వైసీపి తట్టుకోగలదా?

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి సిఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టిన విషయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ వైసీపి పాలిట అణుబాంబులా విస్పోటనం చెందడం గమనిస్తే ఏడుకొండల వెంకన్న స్వామి మహత్యం ఏమిటో మరోసారి నిరూపితం అవుతోంది. ఇంత పాపం చేసినందుకే ఎన్నికలలో వైసీపి అంత దారుణంగా ఓడిపోయిందేమో అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.

ADVERTISEMENT

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీతో సహా పలు దేవాలయాలలో అపచారాలు, దొంగతనాలు, విగ్రహాల విధ్వంసాలు జరిగాయి. హిందువుల పండుగలపై ఆంక్షలు విచించారు. గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో అత్యధికంగా మత మార్పిడిలు జరిగాయి.

జగన్‌ క్రీస్టియన్ మతావలంభికుడు కనుక హిందూ సాంప్రదాయాలను ఆయన పట్టించుకోరు. ఈ నేపధ్యంలో తిరుమలలో ఈ అపచారానికి పాల్పడే ఉంటారని భక్తులు గట్టిగా నమ్ముతున్నారు.

ఈ అంశంపై అప్పుడే అయోధ్య రామ మందిరం అర్చకులు, దేశంలో వివిద పీఠాధిపతులు, కేంద్రమంత్రులు, హైందవ సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయంటే వైసీపికి ఇది ఎంత పెద్ద ఎదురుదెబ్బ కాబోతోందో అర్దం చేసుకోవచ్చు.

హిందుత్వ అజెండాగా పనిచేసే బీజేపీ ఇంకా రంగంలోకి దిగలేదు. రంగంలో దిగేముందు అన్నిటినీ నిశితంగా గమనిస్తోంది. దిగితే ఈ అంశం మరోస్థాయికి చేరుకుంటుంది.

ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఇంతగా ప్రకంపనలు ఏర్పడుతున్నా వారానికి ఒకసారి తిరుమలకి వెళ్ళి వచ్చిన మాజీ మంత్రి రోజాతో సహా వైసీపి నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించకపోవడం గమనిస్తే వారు ఎంత ఆందోళన చెందుతున్నారో అర్దం చేసుకోవచ్చు.

పార్టీలో అందరూ మౌనం వహిస్తే పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది కనుక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్‌ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీని గురించి మాట్లాడబోతున్నారు. అధికారంలో ఉండగా ఎన్నడూ మీడియా సమావేశంలో పాల్గొనని జగన్‌ ఇప్పుడు స్వయంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే వైసీపి ఎంత ఇరకాటంలో పడిందో అర్దం చేసుకోవచ్చు.

వైసీపి తమ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి హైకోర్టులో పిటిషన్‌ వేసి దీనిపై సిట్టింగ్ జడ్జ్ లేదా హైకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని కోరింది. ఈ కేసుని ఏపీ సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తు మొదలుపెడితే ఏమవుతుందో వైసీపికి బాగా తెలుసు. బహుశః అందుకే హైకోర్టుని ఆశ్రయించి ఉండవచ్చు.

జగన్‌ తాను క్రీస్టియన్ కనుక తిరుమల వెంకన్న తనను ఏమీ చేయలేడని, తాను ఏమి చేసినా చెల్లుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఈ ఒక్క తప్పుతోనే వైసీపి పూర్తిగా తుడుచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Are Paid Reviews Misleading OTT Audiences?

A film can have a weak trailer, little audience interest and still look like a…

17 seconds ago

AP Local Body Elections: Can CBN and PK Keep the Alliance United?

After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…

11 minutes ago