టాలీవుడ్‌-రేవంత్: ఎవరికి ఎవరు వార్నింగ్?

తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు, బిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎంతో సఖ్యతగా ఉండేవారు. రేవంత్ రెడ్డి కూడా వారితో అంతే సఖ్యతగా ఉండాలని ప్రయత్నించారు. కేసీఆర్‌ హయంలో నిలిపివేసిన నంది అవార్డుల ప్రధానోత్సవం తిరిగి ప్రారంభించాలని టాలీవుడ్‌ పెద్దలు కోరగానే వెంటనే అంగీకరించారు.

కానీ నంది అవార్డులకు బదులు ప్రజాకవి గద్దర్ పేరిట అవార్డుల కార్యక్రమం నిర్వహించుకుందామని రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా టాలీవుడ్‌ స్పందించలేదు. దానిపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు కూడా.

ADVERTISEMENT

బహుశః అప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వానికి- టాలీవుడ్‌కి మద్య దూరం పెరగడం మొదలైంది. కానీ దూరం పెరగడానికి అదేమీ బలమైన కారణం కాదని అర్దమవుతూనే ఉంది.

ఆ తర్వాత హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేయడంతో టాలీవుడ్‌ ఉలిక్కి పడింది. బహుశః రేవంత్ రెడ్డి ఆవిదంగా టాలీవుడ్‌కి మొదటి హెచ్చరిక పంపిన్నట్లు భావించవచ్చు.

అప్పుడు టాలీవుడ్‌ ఈవిదంగా స్పందించలేదు కానీ సరిగ్గా అదే కారణంగా అది తెలంగాణ ప్రభుత్వానికి మరింత దూరమైన్నట్లు కనిపించింది.

ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్‌ చేతికి చిక్కింది. అప్పుడు యావత్ టాలీవుడ్‌ అక్కినేని నాగార్జునకు అండగా నిలబడి మంత్రి కొండా సురేఖపై ఏవిదంగా ఎదురు దాడి చేసిందో అందరూ చూశారు.

ఆమె అక్కినేని నాగార్జునకు క్షమాపణలు చెప్పుకున్నప్పటికీ ఆమెపై క్రిమినల్ కేసు, వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విషయంలో వెనక్కు తగ్గాలని కాంగ్రెస్‌ పార్టీ సూచించినప్పటికీ నాగార్జున వెనక్కు తగ్గలేదు. నేటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది.

బహుశః ఇది రేవంత్ రెడ్డి, మంత్రుల అహం దెబ్బతీసి ఉండొచ్చు. కనుక రేవంత్ రెడ్డి కూడా సరైన సమయం చూసి అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయించి టాలీవుడ్‌కి గట్టి హెచ్చరిక పంపించారని భావించవచ్చు.

ఒకవేళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే అల్లు అర్జున్‌కి బెయిల్ దొరక్కుండా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆయన ఉద్దేశ్యం టాలీవుడ్‌కి హెచ్చరిక పంపడమే. అల్లు అర్జున్‌ అరెస్టుతో ఆ హెచ్చరిక పంపారు కనుక వెనక్కు తగ్గి ఉండొచ్చు.

రేవంత్ ప్రభుత్వం పంపిన హెచ్చరికను టాలీవుడ్‌ పెద్దలు బాగానే అర్దం చేసుకున్నారు. కానీ వారు కూడా ప్రభుత్వానికి అదే స్థాయిలో సందేశం పంపాలని భావించిన్నట్లున్నారు.

అందుకే ఈరోజు ఉదయం అల్లు అర్జున్‌ ఇంటికి చేరుకోగానే టాలీవుడ్‌ పెద్దలందరూ వచ్చి పరామర్శించారు. ఆయనతో ఫోటోలు, వీడియోలు దిగి మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేశారు. ఇదంతా యాదృచ్ఛికమని అనుకోలేము.

అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయడాన్ని తామందరం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని, అల్లు అర్జున్‌కి మేమందరం అండగా ఉన్నామని టాలీవుడ్‌ పెద్దలు ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం పంపిన్నట్లే భావించవచ్చు. రేవంత్ ప్రభుత్వం కూడా దీనిని సరిగ్గానే డీకోడ్ చేసుకొని అర్దం చేసుకోగలదు.

అల్లు అర్జున్‌ అరెస్టుని వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు గట్టిగా ఖండించాయి. కనుక ఇకపై టాలీవుడ్‌ వెనుక బిఆర్ఎస్ పార్టీ తప్పక ఉంటుందని, టాలీవుడ్‌ కూడా ఆ పార్టీతో కనెక్ట్ అవుతుందని భావించవచ్చు.

కానీ వైసీపీ, దాని అధినేతతో టాలీవుడ్‌ చాలా చేదు అనుభవాలు ఎదుర్కొంది కనుక టాలీవుడ్‌ ఎప్పటిలాగే వైసీపీకి దూరంగా ఉంటుంది. అల్లు అర్జున్‌కి వైసీపీ మద్దతు ప్రకటించినప్పటికీ, ఆయన కూడా వైసీపీకి దూరంగా ఉండాల్సిన అవసరమే ఎక్కువ కనిపిస్తోందిప్పుడు. కానీ ఈ చేదు అనుభవం కారణంగానే ఆయన వైసీపీతో కనెక్ట్ అయినా ఆశ్చర్యం లేదు. వైసీపీ కూడా అదే ఆశిస్తోంది.

ఒకవేళ టాలీవుడ్‌ బిఆర్ఎస్ పార్టీతో కనెక్ట్ అయితే ఇంతకాలం రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్‌కి మద్య సాగుతున్న ఈ కోల్డ్ వార్ ఇకపై ప్రత్యక్ష యుద్ధంగా మారవచ్చు. లేదా ఈ తాజా హెచ్చరిక నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వంతో టాలీవుడ్‌ రాజీ పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక మరో సస్పెన్స్ సినిమాకు అందరూ ఎదురుచూడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

37 minutes ago

After Vijay, Will Nayanthara Enter Tamil Nadu Politics?

Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…

52 minutes ago