సమ్మర్ సీజన్ ని రీ రిలీజులకి వదిలేశారుగా..

Crowds watching re released Telugu movies like Darling during empty summer 2026 season

ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్ లను గాలికొదిలేస్తున్నారు. అందుకు నిదర్శనం 2026 సమ్మర్ సీజన్. రామ్ చరణ్ “పెద్ది”తో సమ్మర్ సీజన్ ను, అది కూడా ఐపీఎల్ సీజన్ ను హైజాక్ చేస్తాడు అనుకుంటే.. జూన్ కి షిఫ్ట్ అయ్యి మెగా అభిమానుల ఆశల మీద నీళ్లు జల్లాడు.

పోనీ పెద్ది వదిలిన స్పేస్ లో వేరే ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తే.. ఏ ఒక్క పెద్ద సినిమా ఆ స్టేజ్ లో లేక సైలెంట్ గా ఉన్నాయి. గతవారం “తిమ్మరాజుపల్లి, పాపం ప్రతాప్”, ఈవారం “గేదెల రాజు”, వచ్చేవారం “జెట్ లీ, గాయపడ్డ సింహం” లాంటి చిన్న సినిమాలు తప్ప.. ప్రేక్షకుల్ని థియేటర్ల వద్ద క్యూ కట్టించే సినిమాలు లేవు.

ADVERTISEMENT

దాంతో పెద్ద సినిమాల రీరిలీజుల్ని రంగంలోకి దింపారు కొందరు నిర్మాతలు. అందులో భాగంగా ప్రభాస్ “డార్లింగ్” నిన్న విడుదలై మంచి బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఆది సాయికుమార్ “ప్రేమ కావాలి”నీ కూడా రీరిలీజ్ చేసారు. నాని “నిన్ను కోరి” సినిమా కూడా రెడీగా ఉంది.

తెలుగు రీ రిలీజులు సరిపోవన్నట్లు, హిందీ రీ రిలీజులు కూడా రంగంలోకి దిగాయి. “లాపతా లేడీస్, దేవ్ డి” లాంటి సినిమాలు మళ్లీ విడుదలకి సిద్ధమవుతున్నాయి. మన దర్శకనిర్మాతలు సరైన ప్లానింగ్ లేక వదిలేసిన సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల్ని థియేటర్లకి తీసుకురావడానికి ఈ రీ రిలీజులు అనేవి కొంతమేరకు సహకరిస్తున్నాయి.

అయినా.. స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి, ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఇంట్లో తల్లిదండ్రుల్ని కూడా బయటికి తీసుకెళ్ళండి అని గోల పెట్టి మరీ సినిమాలకి తరలి వచ్చే సమ్మర్ సీజన్ ను టాలీవుడ్ ఇలా లైట్ తీసుకోవడం అనేది బాక్సాఫీస్ కి స్వయంగా డెంట్ పెట్టుకుంటున్నట్లే.

ADVERTISEMENT
Latest Stories