
పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు హడావుడిగా అమరావతిని రాజధానిగా ప్రకటించి రాష్ట్రాన్ని నిండా ముంచేశారని ఆరోపించారు. అమరావతిలో కొత్తగా రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, ఓ పక్క సంక్షేమ పధకాలు కొనసాగిస్తూ మరో పక్క అంత సొమ్ము రాజధానిపై ఖర్చు చేయగల స్థోమత రాష్ట్రానికి ఉందా?అని మంత్రి ఆర్‌కె. రోజా ప్రశ్నించారు. అదే కేవలం ఓ పదివేల కోట్లు పెట్టుబడితో విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలలో పరిపాలనా రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసుకోవడం సులువు కదా?ఆమె ఇంకా చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు. అవన్నీ అప్రస్తుతం.
ఆనాడు టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు శాసనసభలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ సభ్యులందరూ బల్లలు చరిచి ఆమోదం తెలిపారు. అమరావతికి అంత భూమి, పెట్టుబడి అవసరం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హటాత్తుగా మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకురావడమే కాకుండా అమరావతిని వ్యతిరేకిస్తూ ఇటువంటి వాదనలు చేస్తున్నారు.
టిడిపిని దాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తప్పు లేదు కానీ అమరావతి కోసం భూములిచ్చిన రైతులను కూడా ద్రోహులుగా అభివర్ణిస్తున్నారు. వారు తమ స్వార్ద ప్రయోజనాల కోసమే పాదయాత్ర చేస్తున్నారని ఆర్‌కె. రోజా విమర్శిస్తున్నారు. వారి వెనుక టిడిపి ఉందని ఆరోపిస్తున్నారు.
మూడు రాజధానులతోనే అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాదిస్తున్నారు. అయితే ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకొన్నారు?మంత్రి పదవి కావాలని తహతహలాడిపోయిన ఆర్‌కె. రోజా, ఈ 3-4 నెలల్లో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఏం చేశారు?అసలు ఎప్పుడైనా దాని గురించి కనీసం మాట్లాడలేదు కూడా. ఇక అభివృద్ధి ఏం చేస్తారు?
అయినా రాష్ట్రంలో రోడ్ల గుంతలే పూడ్చలేకపోతున్నప్పుడు పర్యాటక రంగానికి నిధులు ఎలా కేటాయిస్తారు? మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు? ఇంకా ఎప్పుడు నిర్మిస్తారు? అని సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వానికి అంతగా నమ్మకముంటే ‘మూడు రాజధానుల’ అంశంతోనే ఎన్నికలకి రావాలని టిడిపి చేస్తున్న సవాళ్లను స్వీకరించవచ్చు కదా? దాంతో గెలిస్తే ఇక టిడిపి కూడా నోరెత్తలేదు కదా?
The pending enforcement directorate and central bureau of investigation cases against Jagan had been jurisdiction…
2011వ సంవత్సరంలో పుట్టిన పిల్ల లేదా పిల్లాడి వయసు ఇప్పుడు ఎంత అంటే 15 ఏళ్ళు! అని టక్కున సమాధానం…