
ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో వికృత పర్వం నడుస్తుందా అన్నట్టుగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థి పార్టీల నేతలను విమర్శించే తీరు నానాటికి దిగజారిపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో బిఆర్ఎస్ మొదలు పెట్టిన ఈ పైశాచిక రాజకీయ విధానాలు, 2014 అనంతరం వైసీపీ రూపంలో ఏపీని కూడా తాకాయి.
సినిమాలకు సెన్సార్ మాదిరి రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లకు కూడా ఒక సెన్సార్ అవసరమని నాడు కేసీఆర్ నిరూపిస్తే ఆ తరువాత దాన్ని కొడాలి నాని కొనసాగించారు. ఇక ఇప్పుడు మా వంతు అంటూ కాంగ్రెస్ కూడా తన రాజకీయ రంగుని, రుచిని మార్చేస్తూ ముందుకెళ్తుంది.
బిఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ తెలంగాణ రాజకీయాలలో చుట్టం చూపుగా కనిపిస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో బయటకు రావడం లేదు, యాక్టీవ్ గా రాజకీయాలు చేయడం లేదు. ఇక ఇటు రాజకీయాలకు తోడు అటు కవిత రూపంలో కల్వకుంట్ల కుటుంబంలో కూడా వివాదాలు బయటకు రావడంతో కాంగ్రెస్ కి కేసీఆర్ ని ఇరుకున పెట్టేందుకు మంచి ఆయుధాలే చిక్కినట్టయ్యింది.
అయితే కాంగ్రెస్ ఆ ఆయుధాలను కేసీఆర్ ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు వినియోగిస్తున్నారు. పదేపదే బహిరంగంగా కేసీఆర్ చావు కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం రోత గా అనిపిస్తుంది. తాజాగా కేటీఆర్, హరీష్ లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ చావుని కోరుకుంటున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
గతంలో కూడా కాంగ్రెస్ ఇదే తీరుగా కేసీఆర్ మరణం పై విమర్శలు చేసి బిఆర్ఎస్ శ్రేణులను, ముఖ్యంగా కేటీఆర్ ని రెచ్చకొట్టింది. అందుకు రెచ్చిపోయిన కేటీఆర్ సైతం తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ ను ఉద్దేశించి ఆయన ఒక అర్భకుడు, ఒక నికృష్టుడు, అంగుష్ఠమాత్రుడు అంటూ రెచ్చిపోయారు.
అలాగే అటు హరీష్ సైతం రేవంత్ ను వాడు వీడు అంటూ సంబోధిస్తూ ముఖ్యమంత్రి పదవికున్న గౌరవాన్ని – మర్యాదను దిగజారుస్తున్నారు. ఇక రేవంత్ కూడా ముఖ్యంమత్రిగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ ని ఉరితీయాలి, నాలుక కోస్తా బిడ్డా అంటూ ఇలా తన గౌరవాన్ని తగ్గించుకుంటూ అవతలి వ్యక్తి ని అగౌరవపరుస్తున్నారు.
ఇక బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత కూడా నేనేమన్నా తక్కువా అంటూ హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడిని పట్టుకుని నక్క, కుక్క అంటూ నోరుపారేస్తున్నారు, అలాగే నాజోలికొస్తే కాళ్ళు విరగొడతా అంటూ బిఆర్ఎస్ నేతలను బెదిరిస్తున్నారు.
ఇదేనా రాజకీయం అంటే.? ఇవేనా ఒక రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు.? అంటూ రాజకీయాలను హేసడించుకునే స్థితికి రాజకీయాలను దిగజారుస్తున్నారు ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు. ఇలా ప్రస్తుతం తెల్లరంగంలో చావుల మీద రోత రాజకీయం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బూతు రాజకీయాలను కొనసాగిస్తుంది.
అయితే గతంలో ఇటువంటి పదజాలం ఉపయోగించి ఇటువంటి బెదిరింపులకు పాల్పడి వైసీపీ భారీ మూల్యమే చెల్లించింది. అయినా అటు వైసీపీకి గాని ఇటు తెలంగాణ అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలకు గాని ఇంకా తత్త్వం బోధపడడంలేదు, రాజకీయ జ్ఞానోదయం కలగడం లేదు. మరి ఈ రోత రాజకీయం – బూతు రాజకీయంతో ఈ సారి భారీ మూల్యాన్ని చెల్ల్లించడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉందో అనేది ప్రజలే నిర్ణయిస్తారు..
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…