ట్రైలర్ టాక్ – ఈ హార్రర్ లో ‘ఏదైనా’ జరగవచ్చు!

1920-LONDON-trailer-talkమనిషి మేధస్సుకు అందని దెయ్యాలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించే సినిమాల కధలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎన్ని సినిమాలు వచ్చినా, హార్రర్ సినిమాలకు ఉండే ఆదరణ రీత్యా సినీ దర్శక నిర్మాతలు ఈ కధలను ఎంచుకుంటారు. అందులో భాగంగానే భయపెట్టాలనుకునే మరో సినిమా బాలీవుడ్ లో సిద్ధమవుతోంది.

“1920 లండన్” సినిమా పేరుతో సన్నద్దమవుతున్న ఈ సినిమాలో ‘వాన’ ఫేం మీరా చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. అలాగే మరో పాత్రలో శర్మాన్ జోషి నటించగా, అంతకు ముందు విడుదలైన ‘1920’ సినిమాలలో ఇది మూడవ పార్ట్ కు సంబంధించింది. రాజస్తాన్ నుండి ఒక బహుమతి అందుకున్న తర్వాత హీరో ఇంట్లో జరిగే అనూహ్య పరిణామాలు, ఆ తర్వాత హీరోయిన్ మీరా చోప్రాను హీరో ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా ఇతివృత్తం.

ADVERTISEMENT

సింపుల్ స్టోరీ అయినప్పటికీ కధలో ఉన్న ట్విస్ట్ లు ప్రేక్షకులను కాస్త భయపెట్టేలా కనపడుతున్నాయి. అయితే ఇలాంటి కధలతో ఇప్పటికే చాలా సినిమాలు రావడంతో మే 6న విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అన్న సందేహాలు నెలకొన్నాయి. ట్రైలర్ ‘సూపర్’గా లేకపోయినా… కధలో ఎప్పుడు, ఏదైనా జరగవచ్చు అన్న సంకేతాలు ఇవ్వడంతో కొంత ఆసక్తిని రేకెత్తించడంతో ‘పర్వాలేదనే’ టాక్ సొంతం చేసుకుంది “1920 లండన్” ట్రైలర్.

ADVERTISEMENT
Latest Stories