సోషల్ మీడియా ట్రేండింగ్ CH ‘ANDRA ‘ BABU..!

చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ కి విడదీయరాని బంధం ఉందనేది ఆయన పేరులోని అక్షరాలతోనే తేటతెల్లమయింది. ch ANDRA babu 1995 నుండి 2004 వరకు 9 ఏళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను సైతం హైద్రాబాద్ కు రప్పించి దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసారు బాబు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టడానికి తనవంతు కృషిగా ఐటీ రంగానికి అనువుగా సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించారు. దానితో వేలమంది యువతకు బంగారు భవిష్యత్తును అందించిన విజనరీ లీడర్ గా బాబు పేరు ఎప్పటికి చిరస్మరణీయం అనేది చంద్రబాబు అరెస్టు సమయంలో రుజువయ్యింది.

ADVERTISEMENT

అయితే 2014 విభజన సమయంలో విభజిత ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు అవసరం అనే భావనతో అటు పవన్ తో పాటు ఇటు ప్రజలు కూడా బాబుకు మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం అందించారు. దీనితో 14 ఏళ్లపాటు తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న తొలి సీఎం గా చంద్రబాబు నిలిచిపోయారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై 2024 లో కూడా కూటమి పార్టీ అధికారంలో వస్తే మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని అందుకుని చరిత్ర ఎక్కుతారు.

అయితే గత ముఖ్యమంత్రిగా ఉన్న పాలన అనుభవంతో తెలంగాణకు హైద్రాబాద్ మాదిరి ఏపీకి అమరావతిని నిర్మించాలనే సంకల్పంతో తొలి అడుగు వేసిన బాబు ఐదేళ్ల నిర్దిష్ట కాలపరిమితిలో అప్పులే తప్ప ఆదాయం లేని రాష్ట్రానికి, ఊర్లే తప్ప ఉపాధి లేని ప్రాంతానికి, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలదో అంతా చేసి చూపించారు బాబు.

అంచనాలు ఆకాశంలో ఉండి కాల పరిమితి నిర్దిష్టంగా ఉండడంతో ఏపీ ప్రజల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యి అధికార పక్షం నుండి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు బాబు. ఇక టీడీపీ పని ముగిసింది, బాబుతో పనేముంది అన్న ప్రతిసారి రాష్ట్రానికి తన అవసరాన్ని, ఆవశ్యకతను తెలియచేస్తూనే ఉన్నారు చంద్రబాబు. 2019 ఎన్నికలలో ఏపీ ఓటర్లు బాబు ని కాదని జగన్ కు ఒక్క ఛాన్స్ అవకాశం ఇవ్వడంతో ఇక ఏపీలో నూతన నిర్మాణాలకు ప్రజావేదిక కూల్చివేతలో సమాధి కట్టారు వైస్ జగన్.

2019 నుంచి 2024 వరకు ఏపీలో జరిగిన అధికార మార్పుతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కు పెద్దఎత్తున మేలు జరిగిందనే చెప్పాలి. ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో కూలిన ప్రతి పరిశ్రమ తెలంగాణలో మొలకెత్తింది. దానికి లులు మాల్, అమర్ రాజా బ్యాటరీస్ వంటి సంస్థలు ఉదాహరణలుగా చెప్పవచ్చు. కూల్చివేతల బాధ తెలిసినపుడే కట్టడాల విలువ అర్ధమవుతుంది అనేలా జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతనే చంద్రబాబు విలువ, విజనరీ కి మంచి గుర్తింపు దక్కింది.

ఏపీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ పర్శంటేజ్, విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి విజయాన్ని ప్రతిభింబిస్తుండడంతో మరోసారి చంద్రబాబు కి ఆంధ్రకు మధ్య ఉన్న అనుబంధం ఇదే అంటూ సోషల్ మీడియాలో “CH ‘ANDRA ‘BABU “పేరును ట్రేండింగ్ లో ఉంచుతున్నారు బాబు అభిమానులు. విజనరీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు పేరులో ఉన్న ANDRA అనే పదాన్ని విజన్ చేసింది సోషల్ మీడియా.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

37 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

40 minutes ago