అసలెప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేని “విశ్వంభర” చిత్రానికి ఆ టీమ్ కి మరో సరికొత్త టెన్షన్ మొదలైంది. అదేంటంటే.. హీరోయిన్ త్రిష ప్రమోషన్స్ కి వస్తుందా రాదా?
త్రిష తాను నటించిన తమిళ చిత్రం “కురుప్పు” ఈ 14న విడుదలవుతుంటే.. కనీసం సినిమా గురించి ట్వీట్ చేయలేదు. పైగా నన్ను మర్చిపోయారు అంటూ సినిమా మీద సెటైర్ వేసింది.
అలాంటిది.. ఇప్పుడు అన్ అఫీషియల్ గా విజయ్ మనిషిగా అఫీషియల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న త్రిష.. పొరపాటున మీడియా ముందుకు వస్తే ఏం అడుగుతారు అనేది క్లారిటీ ఉంటుంది. అనిల్ రావిపూడి గట్టిగా మ్యానేజ్ చేసి నయనతారతో కూడా ప్రమోషన్స్ చేయించాడు, ఇప్పుడు విశ్వంభర టీమ్ కి ఇది పెద్ద హెడేక్.
మిగతా హీరోయిన్లతో నెట్టుకురావాలి. వాళ్లేమో చిరంజీవి స్టేచర్ కి సెట్ అవ్వరు. చిన్నపిల్లల్లా ఉంటారు. దాంతో “విశ్వంభర” ప్రమోషన్స్ భారం మొత్తం చిరంజీవి భుజాల మీద పడే పరిస్థితి వచ్చింది.




