
ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకులుగా కొనసాగుతూ… మరో పక్కన సినిమాలను నిర్మిస్తున్న వారి జాబితాలో పూరీ జగన్నాధ్, సుకుమార్, మారుతీల పేర్లు ప్రముఖంగా వినపడుతుంటాయి. పెద్ద చిత్రాలతో పాటు, చిన్న చిత్రాలను కూడా బ్రతికించాలనే వీరి ఆశయం దిగ్విజయంగా సాగుతోంది. ఇందులో తానూ కూడా భాగస్వామి కావాలనుకున్నాడో ఏమో గానీ, త్రివిక్రమ్ కూడా ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇప్పటికిప్పుడు కాకపోయినా… దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను త్రివిక్రమ్ సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ లేడి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో ‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను ‘మాటల మాంత్రికుడు’ నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ రెండు చిత్రాలతో బిజీగా ఉండడంతో, ఇవి పూర్తయిన వెంటనే ఈ సినిమాలో వచ్చి చేరతారని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను నిర్మాత రాధాకృష్ణతో చేయాలనుకున్నప్పటికీ, నందిని రెడ్డి చెప్పిన ఈ కధ త్రివిక్రమ్ కు బాగా నచ్చడంతో తానంతట తానూగా ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన…
మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…