శేఖర్ కమ్ముల వంటి వారు ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించడంతో అప్పుడప్పుడు వచ్చే ‘ప్లజెంట్’ సినిమాలు తెలుగు తెరకు దూరమయ్యాయి. బహుశా ఆ లోటును పూడ్చడానికి ‘మాటల మాంత్రికుడు’ కంకణం కట్టుకున్నట్లుగా కనపడుతున్నాడు. తన తాజా చిత్రం “అ…ఆ…” మొదటి టీజర్ ను వీక్షించిన తర్వాత ప్రేక్షకులకు కలిగే అనుభూతి ఇది.
ADVERTISEMENT
టైటిల్ జస్టిఫికేషన్ డైలాగ్స్… ఓవర్ యాక్షన్ లేనటువంటి సింపుల్ ఎక్స్ ప్రెషన్స్… వినసొంపైన నేపధ్య సంగీతం… చివరగా… త్రివిక్రమ్ మార్క్ డైలాగ్… ‘పక్కపక్కనే ఉన్న రెండు అక్షరాలు కలుసుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది…’ ఇది క్లుప్తంగా “అ… ఆ…” టీజర్ సంగతులు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఆకట్టుకుంటున్న విధానం టీజర్ తో మరింత రెట్టింపయ్యింది. చూడబోతుంటే నితిన్ ఖాతాలో త్రివిక్రమ్ ఒక భారీ హిట్టు వేసేలా కనపడుతున్నాడు.
ADVERTISEMENT



