
అయితే రాజమౌళికి తానే మాత్రం తక్కువ కాదంటూ ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిరూపించుకుంటున్నాడు. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల ద్వారా అల్లు అర్జున్ రేంజ్ ను పెంచిన త్రివిక్రమ్, తాజాగా నితిన్ తో తెరకెక్కించిన ‘అ…ఆ…’ సినిమాతో ఏకంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టనున్నాడనే సంకేతాలు అందుతున్నాయి. ఈ ఏడాది సమ్మర్ చివరి చిత్రంగా విడుదలైన ‘అ…ఆ…’ ఇప్పటివరకు 45 కోట్లకు పైబడి కలెక్షన్స్ కొల్లగోట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఓవర్సీస్ లో కలెక్షన్స్ నెమ్మదించినప్పటికీ, స్థానికంగా చెప్పుకోదగ్గ వసూళ్ళనే సాధిస్తుండడంతో, 50 కోట్ల మ్యాజిక్ ఫిగర్లోకి అడుగు పెడతాడా లేడా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నితిన్ కున్న మార్కెట్ తో పోల్చుకుంటే ‘అ…ఆ…’ సాధించిన కలెక్షన్స్ దాదాపుగా రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. దీంతో ఈ సినిమా విజయం హీరో కన్నా దర్శకుడు ‘మాటల మాంత్రికుడు’ ఖాతాలోనే పడింది. హీరోలకతీతంగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న ఘనత రాజమౌళి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కే దక్కింది.
ఇదే స్పీడ్ లో కొనసాగితే… రాజమౌళి నెంబర్ 1 స్పాట్ కు త్రివిక్రమ్ చెక్ పెడతాడా? అన్న ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. త్రివిక్రమ్ ప్రతిభ తెలిసిన వారు మాత్రం ఇందులో ఏ మాత్రం సందేహ పడడం లేదు గానీ, మార్కెట్ విషయంలో రాజమౌళి కొన్ని మెట్లు పైనే ఉన్నారన్నది అంగీకరించాల్సిన విషయం. వడివడిగా సినిమాలు చేస్తే దీనిని అందుకోవడం త్రివిక్రమ్ స్థాయి వారికి అసాధ్యం కాకపోవచ్చు అన్నది సినీ విశ్లేషకుల మాట.
The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…
Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…