
ఆ స్థాయిలో ప్రేక్షకుల మదిని పలకరించే త్రివిక్రమ్ మాటలన్నీ ఒక దగ్గరికి చేరిస్తే ఎలా ఉంటుంది. అవును… ఈ మాటల మాంత్రికుడి అభిమానులు ప్రస్తుతం అదే పని చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన (సోమవారం నాడు) ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ అనే ఈ ‘భీమవరం బుల్లోడు’ జన్మదినం సందర్భంగా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను మరియు ఆండ్రాయిడ్ లో పనిచేసే విధంగా ఒక మొబైల్ యాప్ ను రూపొందించి విడుదల చేసారు. దీనిని అధికారికంగా త్రివిక్రమ్ జన్మదినం సందర్భంగా ప్రారంభించబోతున్నారు.
“www.trivikramcelluloid.in” అనే పేరుతో ఒక వెబ్ సైట్ ను మరియు ఎబిసి డిజిటల్ మీడియా రూపొందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఉన్న యాప్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు సంబంధించిన సకల సమాచారం ఇందులో అందుబాటులో ఉంచారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలోని పంచ్ డైలాగ్ లతో కూడిన వీడియోలను, ఆడియోలను ఉంచడంతో ‘మాటల మాంత్రికుడు’ ఫ్యాన్స్ కు పండగ పండగగా ఉంది. ఈ సారి త్రివిక్రమ్ జన్మదినోత్సవాన్ని అభిమానులు సదరు వెబ్ సైట్ మరియు యాప్ ను చూసి జరుపుకునే విధంగా ఉండడం విశేషం.
ఒక దర్శకుడికి ఈ రేంజ్ లో అభిమానులు పట్టం కట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. వరుస సక్సెస్ లు ఇస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తున్న రాజమౌళికి కూడా ఇంతటి ప్రేక్షక నీరాజనం లేదు. మరి దీనికి కారణం ఏంటి అని అన్వేషిస్తే… త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక సినిమాలోనిది కాకుండా, మన మదిని తాకాయి…. అందుకే ఈ ‘మాటల మాంత్రికుడు’ పేరు టైటిల్ కార్డ్స్ లో ఉంటే…. అందరికీ అంత ఆసక్తి… ఉత్సాహం..! అక్షరానికి ఉన్న ‘పవర్’ ఏంటో ఈ తరానికి చాటి చెప్పే వ్యక్తులలో ఈ ‘త్రివిక్రముడు’ స్థానం ఎప్పుడూ నెంబర్ వన్నే!
The official release date of Akshay Kumar and Anees Bazmee film, Ram Aur Shyam has…
An Instagram post involving an Indian tech professional has sparked controversy amid ongoing debates around…