50 నియోజకవర్గాలలో తెరాస రెబెల్స్ పై వేటు?

KCR TRS - Surveyఇప్పటికే 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించిన తెరాసకు రెబెల్స్ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడి వాళ్ళను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగం కనపడటం లేదు. ఎన్నిరకాలుగా చెప్పినా సరే అసంతృప్తులు వెనక్కి తగ్గే పరిస్థితి కన్పించలేదని సమాచారం

[m9ad]

ADVERTISEMENT

అందరికీ న్యాయం చేస్తాం..కానీ అభ్యర్థులను మార్చే ప్రసక్తి ఉండదు. దయచేసి అందరూ సర్దుకొండి..పార్టీని గెలిపించాలని మంత్రి కేటీఆర్ రెబల్ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. అనుభవించిన వారు అలాగే చెప్తారు..కష్టపడ్డవాళ్లకు టీఆర్ఎస్ లో గుర్తింపు లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ నిర్ణయం మాత్రం ఒక్కసారి చెప్పిచూద్దాం..పరిస్థితి చూశాక వినకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తున్నారట. దీనిప్రకారం దాదాపుగా 50 నియోజకవర్గాలలో తెరాస రెబెల్స్ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే గనుక జరిగితే అదొక రాజకీయ సంచలనం అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories