
అమెరికా సార్వభౌమత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రపంచదేశాలన్నీ గౌరవించాలి. కానీ అమెరికా మాత్రం ఎవరినీ గౌరవించదు!
పైగా అన్ని దేశాల అంతరంగిక వ్యవహారాలలో తల దూర్చుతుంటుంది. కుదిరితే దేశాధ్యక్షులను ఎత్తుకుపోతుంది లేకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది!
ఇప్పుడు ట్రంప్ ఒక్కరే ఇలా వ్యవహరిస్తున్నారనుకోనవసరం లేదు. అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా ఇదే విధానం.. కాస్త ఎక్కువ తక్కువ అంతే!
ట్రంప్ ఓవర్ యాక్షన్ గురించి అందరికీ తెలిసిందే… గత నెలలో వెనెజువేల అధ్యక్షుడుని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయిన అమెరికా సేనలు ఇప్పుడు ఇరాన్ దేశాధ్యక్షుడు ఆయేతుల్లా ఖొమైనీని ఎత్తుకుపోయేందుకు లేదా ఖతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధవిమానాలు, నౌకలు మొహరించారు. అంటే ఆయేతుల్లా ఖొమైనీ కోసం యమభటులు వచ్చేసినట్లే!
కనుక నేడో రేపో తెల్లారి టీవీలో ‘ఖోమేనీని ఖతం చేసిన అమెరికా సేనలు’ స్క్రోలింగులో కనిపించినా ఆశ్చర్యం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఓ పక్క ఇరాన్‌తో యుద్ధానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న డోనాల్డ్ ట్రంప్, మళ్ళీ ‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని, దాని వలన మూడున్నర కోట్ల మంది ప్రాణాలు కాపాడానని’ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది… కదా?
ట్రంప్ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు, మీడియాకు సర్దిచెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నామని మోడీ ప్రభుత్వం తెలియజేసినప్పటికీ ట్రంప్ పదేపదే దాని గురించే మాట్లాడుతున్నారు. అంటే మోడీ ప్రభుత్వాన్ని ఈవిధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?
వెనెజువేల నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు అమెరికాకు సరఫరా అవుతున్నాయనే సాకుతో ఆ దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. కనుక ఇప్పుడు మాదకద్రవ్యాల ముఠాలు అంతమైపోయాయా?వాటి సరఫరా ఆగిపోయిందా? అనే ప్రశ్న వినిపించడం లేదిప్పుడు.
అక్కడ ట్రంప్ సమంత రాజు పాలన సాగుతోంది. ‘వడ్డించేవాడు మనోడే’ కనుక ఆ దేశానికి చేతి చమురు వదులుతోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వెనెజువేల చమురుని ట్రంప్ దొరవారు భారత్‌తో సహా పలు దేశాలకు ఉదారంగా సరఫరా చేయిస్తున్నారు.
ఈ సొమ్మంతా వెనెజువేలకే వెళ్తోందా లేక దానికి కొంత విదిలించి మిగిలింది ట్రంప్ జేబులో వేసుకుంటున్నారా?అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయినా అమెరికా-వెనెజువేల స్టోరీ మనకెందుకు… అక్కడి నుంచి చమురు పంపిస్తుంటే… అని సరిపెట్టుకోక తప్పదు.
కానీ ఇక్కడ మన దేశంలో కూడా ‘వడ్డించేవాడు మనోడే’ కనుక ‘అసమదీయులకు’ ఇక చమురు కొరత ఉండదు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…