Telugu

ఇతర దేశాలు, అధ్యక్షులు, ప్రజల ప్రాణాలంటే ఇంత చులకనా?

మనిషికి చావు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరెవరు ఎప్పుడు చావాలో ఖచ్చితంగా నిర్ణయించగలరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌.

ట్రంప్‌ పెట్టిన ముహూర్తానికే ఇరాన్‌ అధ్యక్షుడు ఆయతుల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. ఈ చంపుడు ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ట్రంప్‌ సగర్వంగా ‘ట్రూత్’లో చెప్పారు. ఖమేనీ చావు అమెరికా ప్రజల విజయమని చెప్పారు. ఖమేనీ దుష్ట పాలన నుంచి ఇరాన్‌ ప్రజలకు స్వేచ్చ కల్పించానని చెప్పారు.

ADVERTISEMENT

ఈ యుద్ధం అమెరికా ప్రారంభించి ఉండవచ్చు కానీ దీనిని తామే ఊహించని విధంగా ముగిస్తామని ఇరాన్‌ చెప్పుకుంది. కానీ ట్రంప్‌ కోరుకున్నట్లే ముగిసింది.

కానీ తమ దేశాధ్యక్షుడిని హత్య చేసినందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకార దాడులు తప్పవని, అవి ఊహించని సమయంలో, ఊహించని స్థాయిలో ఉంటాయని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇరాన్‌ అధ్యక్షుడు మరణించడంతో ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ తాత్కాలికంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది.

ఈ వార్తలన్నీ ఇప్పటికే అందరికీ తెలుసు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు.

1. అమెరికాకి సద్దాం హుస్సేన్ నచ్చలేదు చంపేశారు. వెనిజువేలా అధ్యక్షుడు నచ్చలేదు. కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. ఇరాన్‌ అధ్యక్షుడు నచ్చలేదు చంపేశారు. ఎందుకంటే వారందరూ దుష్టులు, దుర్మార్గులు కనుక. వారు ప్రజలను పీడిస్తున్నారు కనుక. అణు బాంబులు తయారు చేస్తున్నారు కనుక. ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారారు కనుక.

2. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు దుష్టుడు, దుర్మార్గుడు అయితే, ఆయన పాలనలో అమెరికా ప్రజలు బాధలు అనుభవిస్తుంటే, ఆయన ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుంటే అప్పుడు రష్యా, చైనా లేదా మరో దేశం వైట్‌హౌస్‌ మీద బాంబులు వేసి అమెరికా అధ్యక్షుడుని మట్టు బెట్టవచ్చా?అందుకు అమెరికా ప్రజలు ఒప్పుకుంటారా?

3. అమెరికా సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలు గౌరవించాలని కోరుకుంటునప్పుడు, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని అమెరికా కూడా గౌరవించాలి కదా? కానీ ఇలా ఏదో ఓ సాకుతో ఇతర దేశాలపైకి దండయాత్రలకి బయలుదేరి, దేశాధ్యక్షులను చంపించేయడాన్ని ఏవిధంగా సమర్ధించుకోగలరు?

4. మొన్న వెనిజువేలా అధ్యక్షుడు నచ్చలేదు. నిన్న ఇరాన్‌ అధ్యక్షుడు నచ్చలేదు. రేపు మరో దేశాధ్యక్షుడు నచ్చకపోవచ్చు. ఇలా నచ్చనివాళ్ళందరినీ చంపేస్తూనే ఉంటారా?

5. ట్రంప్‌ ప్రతాపం అంతా చిన్న చిన్న దేశాల మీదే. అదేదో రష్యా, చైనా, ఉత్తర కొరియాపై చూపించవచ్చు కదా? ఆ దేశాధ్యక్షులు కూడా ట్రంప్‌కి సవాళ్లు విసురుతున్నారు కదా?

6. ఇతర దేశాలు, దేశాధ్యక్షులు, అక్కడి ప్రజల ప్రాణాలంటే అమెరికాకు ఇంత చులకనా?అమెరికా తయారు చేసుకునే అత్యాధునిక యుద్ధ విమానాలను, ఆయుధాలను పరీక్షించుకునేందుకు వారేమైనా ప్రయోగశాలలో గిన్నీ పిగ్స్ అనుకుంటున్నారా?

7. ఇప్పటికే ముస్లిం దేశాలన్నీ అమెరికా గుర్రుగా ఉన్నాయి. గతంలో ఇందుకే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది. ఇప్పుడు ట్రంప్‌ చేసిన ఈ నిర్వాకంతో భవిష్యత్‌లో అంతకంటే మరో భయంకరమైన దాడి జరుగకుండా ఉంటుందా? ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిస్తూనే ఉంది కదా? చివరికి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా ‘ట్రంప్‌ అమెరికాను యుద్ధంలోకి లాగుతున్నారంటూ,’ భయాలు వ్యక్తం చేస్తున్నారు కదా?

8. రేపు అమెరికాపై దాడి జరిగి అమెరికన్లు ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యులు ఎవరు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nikhil’s Swayambhu: 175-day shoot, 2,500 VFX shots!

Nikhil Siddhartha is preparing for his upcoming film, Swayambhu. The makers are working to bring…

28 minutes ago

GV Prakash Is Winning on Both Sides in 2026

GV Prakash is having the kind of year that can easily be called a golden…

43 minutes ago