
అంబానీ, అదానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే దాని విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. అలాంటిది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో దోస్తీ అంటే అల్లాటప్ప విషయం కానేకాదు.
మోడీ నా జిగిరీ దోస్త్! అని ట్రంప్ పదేపదే అంటున్నప్పుడే భారతీయులు అందరూ భయపడ్డారు. కానీ ట్రంప్‌తో దోస్తీ మరీ ఇంత ఖరీదు ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ దోస్తీ ఖరీదు 93 మిలియన్ డాలర్లు. ట్రంప్‌తో దోస్తీ.. ఈ మాత్రం తప్పదు!
భారత్, రష్యా ఆర్ధిక వ్యవస్థలు చచ్చిపోయిన శవాల వంటివని, రెండు దేశాలు కలిపి వాటిని తగలెట్టుకున్నా నాకు అనవసరమని రెండు మూడు నెలల క్రితమే ట్రంప్ అన్నారు.
ఇప్పుడు అదే భారత్ 93 మిలియన్ డాలర్లు చెల్లించి అమెరికా నుంచి ఆయుధాలు కొంటోంది. ట్రంప్ మాటలే నిజమనుకుంటే ముష్టిలో వీరముష్టి అనుకోవాలేమో? కానీ భారత్ ఆర్ధిక వ్యవస్థ ఎంత బలమైనదో ఈ 93 మిలియన్ డాలర్ల ఒప్పందమే చెపుతోంది కదా?
కనుక ట్రంప్ సుంకాలు, హెచ్-1బీ వీసా ఆంక్షలు, ఈ బెదిరింపులు దేనికో ఈ మొదటి డీల్‌తోనే స్పష్టమయ్యింది. కానీ ట్రంప్ భారత్‌కు ఆయుధాలు అమ్ముకోవాలనుకుంటే దానికి ఇంత డొంక తిరుగుడు అవసరమా?అని సందేహం కలుగవచ్చు.
అవసరమే! లేకుంటే భారత్‌కు ఆయుధాలు అమ్మేందుకు చాలా దేశాలు లైన్లో నిలబడున్నాయి. అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే బుకింగ్ కౌంటరులో కాస్త దౌర్జన్యం చేయాల్సిందే లేదా నయాన్నో భయాన్నో టికెట్ సంపాదించుకోవలసిందే! ట్రంప్ కూడా సరిగ్గా ఇదే చేసి టికెట్ సంపాదించుకున్నారు. దాని ఖరీదు జస్ట్ 93 మిలియన్ డాలర్లు!
మోడీ ఇప్పుడు లైన్లోకి వచ్చేశారు… అని ఈ డీల్‌తో తేలిపోయింది. ఇంకా భారత్‌కి అంటగట్టాల్సిన ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధ విమానాలు, జన్యు మార్పిడి చేసిన ఆహార ఉత్పత్తులు ఏవైనా ఉంటే, వాటికీ మోడీ సంతకాలు పెట్టేస్తే మోడీతో దోస్తీ ఫైనల్ అయిపోతుంది.
తర్వాత సుంకాలు తగ్గిపోతాయి. మళ్ళీ భారత్ నుంచి అమెరికాకి ఎగుమతులు మొదలవుతాయి. అప్పుడు వాటి వలన అమెరికాకు ఎటువంటి నష్టమూ కలుగదని ట్రంపే అమెరికన్లకు చెపుతారు.
విదేశీ ఉద్యోగులు పనిచేయడం వలన అమెరికాకు ఎటువంటి నష్టమూ లేదని నిన్నో మొన్నో ట్రంప్ చెప్పేశారు కదా అలాగే ఇదీను. కనుక త్వరలో హెచ్-1బీ వీసాల స్టోరీ కూడా కొలిక్కి వచ్చేస్తుంది. ట్రంప్ దర్శకత్వంలో చూపించిన హాలీవుడ్ సినిమా ఓవర్!
A strange trend is slowly becoming visible in Tollywood. Some films are reaching theatres without…
Kayadu Lohar came into Tollywood with plenty of promise, but three films later, her Telugu…