
రాజకీయాలతో సంబంధం లేని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడిగా ఉంటున్న రమణ దీక్షితులు గత 2019 ఎన్నికలలో సమయంలో తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మాయం అంటూ అప్పటి టిటిడి పాలక మండలి పైన అప్పటి టీడీపీ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేసి శ్రీ వారి భక్తుల అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు రమణ దీక్షితులు.
అసలు శ్రీవారి ఆభరణాలలో పింక్ డైమండ్ ప్రస్తావనే లేదు అనేది టిటిడి వాదన. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, స్వామి వారికి జరిగే కాంకార్యల విషయంలో కూడా టిటిడి నిర్లక్ష్యం చేస్తుంది, శ్రీ వారిని భక్తులే రక్షించుకోవాలి అంటూ భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేసిన దీక్షితులు పరోక్షంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ మాయలో పడ్డారు.
టిటిడి రికార్డులలో లేని పింక్ డైమండ్ కోసం కొన్ని మీడియా ఛానెల్స్ లో నిరంతర చర్చలు, టీవీ డిబేట్లు నిర్వహించి అప్పటి ప్రభుత్వం పై బురద జల్లారు. అయితే ఎప్పుడు లేని విధంగా తిరుమల పై అక్రమాలు అంటూ ముందుకు వచ్చిన దీక్షితులు గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అనూహ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను కలిశారు.
తనకు ఎవరు అన్నం పెడితే వారికి దణ్ణం పెడతాను అని చెప్పిన దీక్షితులు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ కు తనకు టిటిడి లో పోయిన పదవిని తిరిగి ఇచ్చినందుకు దణ్ణంపెట్టారు. దీనితో వైసీపీ కి రమణ దీక్షితులకి మధ్య ఉన్న బంధం బయటపడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళు స్వామి భజనతో పాటుగా జగన్ భజన కూడా చేసారు అర్చకుల వారు.
అయితే అప్పుడు అన్నం పెట్టినవాడే ఇప్పుడు సున్నం పెడతాడు అని గ్రహించలేకపోయారు రమణ దీక్షితులు. దీక్షితుల పై టిటిడి పాలక మండలి వేటు వేసింది. టిటిడి లో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, టిటిడి పాలక మండలిలో ఉంటున్న సభ్యులలో సింహ భాగం అన్యమతస్తులే అంటూ ఇప్పటి టిటిడి పాలక మండలి పై ఆరోపణలు చేసారు. టిటిడి ఈవో ఒక క్రైస్తవ మతస్తుడని, ఆయన కుమారుడు మృతి చెందినప్పుడు కూడా క్రైస్తవ మత సంప్రదాయాలనే పాటించారు.
అలాగే , తిరుమలలో కొన్ని రోజుల నుంచి గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి టిటిడి నుంచి రమణ దీక్షితులు తప్పిస్తున్నట్లు ఒక ప్రకటన జారీ చేసారు. అలాగే అహోబిలం మఠ పెద్దలు, అర్చకులు, జీయర్లు కూడా రమణ దీక్షితుల వ్యాక్యల పై చర్యలు తీసుకోవాలంటూ టిటిడి పాలకమండలికి ఫిర్యాదు చేసారు.
అయితే ఆ వీడియో లో ఉన్న గొంతు తనది కాదు అంటూ రమణ దీక్షితులు వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీనితో రమణ దీక్షితులు ని టిటిడి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు టిటిడి బోర్డు. అప్పట్లో పింక్ డైమండ్ అంటూ అల్లిన కట్టుకథ ని నమ్మిన జగన్ ఇప్పుడు గొంతు నాది కాదు అంటూ చెప్తున్న కట్టుకథ ని నమ్మలేక పోతున్నారా..? దేవునితో రాజకీయాలు చేస్తే ఇలానే అవుతుంది. లేని పింక్ డైమండ్, ఉన్న పదవి, గౌరవం మొత్తం…గోవిందా…గోవిందానేనా…!
The upcoming local body elections in Andhra Pradesh are putting political families back in the…
Sai Durgha Tej, filmmaker Teja Kakumanu and producer Anil Sunkara are joining hands for #SDT19.…