టీవీ9 కూడా సాక్షితో కలిసిపోయిందా?

TV9  allegations on chandrababu naiduప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 కొత్త మేనేజ్మెంట్ వచ్చాకా పూర్తిగా టీడీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నట్టు ఉంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలో టిడిపి కార్యకర్తల సమావేశంలో తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 తో ముందుకు వెళ్లానని, తన విజన్ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆ విజన్ కు సంబంధించిన పలు పత్రాలను తీసుకు వెళ్లి ఒక పుస్తకంలో ప్రస్తావించారని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఇది నిజంగానే జరిగినట్టు కలాంకు చంద్రబాబు అంటే విశేషమైన అనుబంధం ఉన్న విషయం అప్పటి వార్తలు రెగ్యులర్ గా ఫాలో అయిన వారికి తెలిసిందే. చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావించిన విషయాన్ని సాక్షి, టీవీ9 వక్రీకరించడం విశేషం. కలాంకు తానే విజన్ నేర్పానని వారు వార్తలు వడ్డివార్చడం విశేషం.

దానిని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అబ్దుల్ కలాం పేరిట ఇచ్చే ప్రతిభ అవార్డుల పేరు వైఎస్సార్ ప్రతిభ అవార్డులుగా మార్చే ప్రయత్నం చేసి, ప్రజల నుండి విమర్శలు రావడంతో విరమించుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా కలాం అంటే గౌరవం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా అయిన సాక్షి సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఇటువంటి ప్రచారానికి టీవీ9 కూడా తోడ్పడుతున్నట్టు ఉంది.

ADVERTISEMENT
Latest Stories