
రాష్ట్ర విభజనతో రాజకీయాల నుండి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి ఒక రాజకీయ ప్రవచన కర్తగా కొత్త రూపం ఎత్తారు. అయితే ఈయన గారి రాజకీయాలు అధికారంలో ఉన్న పార్టీలను బట్టి మారుతూ ఉంటాయి.
సీజనల్ ఫ్రూట్స్ మాదిరి, ఉండవల్లి కూడా సీజనల్ రాజకీయ ప్రవచన కర్త గా మారుతూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైస్ రాజశేఖర్ రెడ్డి పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి జగన్ నియంత పాలన పై నోరెత్తలేని ఉండవల్లి, బాబు ముఖ్యమంత్రి కాగానే తిరిగి మీడియా ముందుకొచ్చి అప్పుడప్పుడు ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రవచనాలు, ప్రభుత్వ పేదలకు కొన్ని రాజకీయ సూక్తులు ఉపదేశిస్తూ ఉంటారు.
అయితే తాజాగా నేడు మీడియా ముందుకొచ్చిన ఉండవల్లి తన ఊసరవెల్లి మనస్తత్వాన్ని మరోసారి భయటపెట్టుకున్నారు. ముంబై నటి జిత్వాని కేసులో అరెస్టయ్యి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పై కూటమి ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని, అలా చేయడం బాబు ప్రభుత్వానికి భావ్యం కాదంటూ తెగ బాధపడుతున్నారు ఈ మాజీ ఎంపీ గారు.
జిత్వాని కేసులో పీఎస్ఆర్ ను అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు, ఇలా చేయడం పోలీస్ శాఖ పై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఇటువంటి చర్యలతో ప్రభుత్వం కక్ష్య రాజకీయాలకు తెరలేపుతుందంటూ చెప్పుకొచ్చిన ఉండవల్లి పోలీస్ వ్యవస్థ పై కుంటి ప్రేమ చూపుతున్నారా అన్న సందేహం వస్తుంది.
విపక్షంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత వైస్ జగన్ తన పార్టీ నేతల అరెస్టుల మీద స్పందిస్తూ, మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పోలీసుల గుడ్డలూడతీసి నడి రోడ్డున నిల్చోబెడతాం, వారు రిటైర్ అయినా వదలం, ఏడు సముద్రాల అవతల ఉన్న వెతికి మరి పట్టుకొస్తాం అంటూ పోలీస్ వ్యవస్థ మీద అద్దు అదుపులేని విమర్శలు చేస్తూ అధికారులను బెదిరించేందుకు సిద్ధపడ్డారు.
అయితే జగన్ పోలీస్ వ్యవస్థ మీద చేసిన నీచమైన వ్యాఖ్యలు చెవినపడని ఉండవల్లికి, చట్టాన్ని అతిక్రమించి ఒక మహిళ పై ఆ మహిళా కుటుంబం పై అధికారం ముసుగులో రాజకీయాలాడిన అధికారిని అరెస్టు చెయ్యకూడదు అంటూ కూటమి ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ఇలా చేయడం ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నాయకుడికి తగునా.?
అసలు ఉండవల్లి అరుణ కుమార్ చెపుతున్న ఈ రాజకీయ సూక్తులను, పొలిటికల్ ప్రవచనాలను రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా వింటుందా.? అలాగే ఏ రాజకీయ నాయకుడైన పట్టించుకుంటాడా.? అంటే ఈయన గారి ప్రెస్ మీట్లు వినివారే కానీ పట్టించుకునేవారు లేరనేది వాస్తవం.
ఇలా రాజకీయ విశ్లేషకుడి ముసుగులో, రాష్ట్ర శ్రేయోభిలాషి రూపంలో ఉండవల్లి వేసుకున్న నీలి రంగు ఎప్పుడో బయటపడిపోయిన విషయం ఉండవల్లి ఇప్పటికి గ్రహించలేకపోవడం ఇక్కడ కొసమెరుపు.
ఈయన మాదిరిగానే గతంలో కేవలం బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కుల రాజకీయం నడిపిన ఒక పెద్దాయన 2024 ఎన్నికల ముందు తన అసలు రంగు బయటపెట్టుకుని చివరికి పుట్టుకతో వచ్చిన పేరు, కులాన్ని కూడా మార్చుకుని కన్న బిడ్డకు సైతం దూరమయ్యారు.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…