
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రిని బూతులు తిట్టి అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని పరామర్శించి అటు పిదప మీడియా ముందుకొచ్చారు ఉండవల్లి.
అంబటి విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా కనిపిస్తున్నాయని, ముఖ్యమంత్రిని తిడితే సెంట్రల్ జైల్లో పెడతారా.? ఈ కేసు అటు వైసీపీ పార్టీకి ఇటు అంబటి రాంబాబుకి రాజకీయ మైల్జ్ తెచ్చిందని ఇటువంటి నయా రాజకీయాన్నీ తన ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదంటూ ఉండవల్లి మరోసారి తన నీలి రంగు బయటపెట్టుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాభి విషయంలో వైసీపీ చేసిన చర్యలు, జగన్ వాడిన భాష ఉండవల్లి మరిచినట్టున్నారు, నాడు వైసీపీ బడా నాయకుల నుంచి చోటామోటా నేతల వరకు, పార్టీ క్యాడర్ తో సహా అందరు టీడీపీ కార్యాలయాల మీద దాడులతో తెగబడ్డారు.
అలాగే జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ నేత పట్టాభిని అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపిన వైనం ఉండవల్లి దృష్టిలో లేదా.? నాడు వైసీపీ ని వేలెత్తి చూపలేని ఈ మేధావి, జగన్ పై నోరెత్తి విమర్శించలేని ఈ అనుభవశాలి ఇప్పుడు బాబు పై ఆరోపణలు చేయడానికి, కూటమి ప్రభుత్వం పై నిందలు వేయడానికి ముందుకొచ్చారు.
ఇక ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో సైతం ఉండవల్లి వైసీపీ కే జై కొట్టారు, జగన్ కు అనుకూలంగానే ప్రకటనలు చేసారు. సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడైనా జంతు కొవ్వు కలవలేదని చెప్పిందా అంటూ బాబు నాడు మీడియా వారిన అడిగిన ప్రశ్నకు గాను
పేజీ నంబర్ 20 లో తక్కువ మోతాదులో జంతు కొవ్వు ఉందంటూ చదివి వినిపించి తక్కువ మోతాదు అంటే అసలు లేనట్టే అంటూ కల్తీ వ్యవహారాన్ని కళ్ళ జోడు తీసి పెట్టుకునే సమయంలోనే నిర్దారించేసారు ఉండవల్లి. మరి ఉండవల్లికి తెలిసిన ఈ చిన్న మ్యాటర్ వైసీపీ కి తెలియలేదా.? జగన్ ఎందుకని ఇన్నాళ్లుగా ఆ పేజీ 20 ని చదవలేకపోయారు.?
తక్కువ మోతాదులో అంటే అసలు లేనట్టే అంటూ ఉండవల్లి ఎలా నిర్దారించగలరు.? ఇలా వైసీపీ కి రాజకీయ అవసరం ఏర్పడిన ప్రతిసారి ఈ మాజీ మంత్రి సేవలు జగన్ కు అందుబాటులోకి వచ్చేస్తాయి. అసలు కల్తీ నెయ్యి చుట్టూ ఇన్ని రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంటే ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉండి సడన్ గా ఉండవల్లి ఇప్పుడే బయటకురావడం వెనుక ఉన్న వైసీపీ వ్యూహం ఏంటి.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…