అన్ స్టాపబుల్: అతిథి సంస్కారాన్ని ఎగతాళి చేయడం ఫ్యానిజమా

NBK-Unstoppable-With-Pawan-Kalyanస్టార్ హీరోల మధ్య మంచి స్నేహపూర్వ వాతావరణం గతంలోనూ ఉన్నదే అయినా ఈ మధ్యకాలంలో మరిన్ని మంచి పరిణామాలు సంతోషం కలిగేలా చేస్తున్నాయి. మహేష్ బాబు ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా రావడం, మేమంతా ఒకటేనని ఇద్దరూ నాలుగు చక్కని మాటలు చెప్పడం సగటు ప్రేక్షకులకూ సంతోషాన్ని కలిగించాయి. చరణ్ తారక్ లు కలిసి ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీ స్టారర్ చేశాక ఇలాంటివి మరిన్ని జరగాలని అందరూ కోరుకున్నారు. ప్రభాస్ గోపీచంద్ ల మధ్య స్నేహం ఎంతగా ఘాడంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ అసలెందుకీ ప్రస్తావన వచ్చిందో చూద్దాం

ADVERTISEMENT

ఇవాళ అన్ స్టాపబుల్ షోలో అరుదైన కలయిక జరిగింది. నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. న్యూస్ ఛానల్స్ ఏకంగా లైవ్ రిపోర్టింగ్ ఇచ్చాయి. ఇద్దరి అభిమానులు బయట పడిగాపులు కాచి తమ హీరోలకు స్వాగతం చెప్పేందుకు ఎదురు చూశారు. షూట్ మొదలుకాకముందే ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఎప్పుడో కానీ చాలా అరుదుగా పవన్ బాలయ్యలు కలుసుకుంటారు. అది కూడా ఏదైనా పెళ్లి లాంటి వేడుకల్లో తప్ప పరస్పరం సినిమా ఫంక్షన్లకు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఈ కాంబినేషన్ నయనానందకరంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

ఇక్కడ దాకా బాగానే ఉంది కొందరు ఫ్యాన్స్ కుంచిత మనస్తత్వం ఆహ్లాదకరమైన కార్యక్రమం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తోంది. బాలకృష్ణ అల్లు అరవింద్ ఇతర యూనిట్ సభ్యులు పవన్ రాక కోసం ఎదురు చూస్తున్న వీడియోని తీసుకుని కొంత మంది పవన్ అభిమానులు దీనికి విపరీత అర్థాలు తీయడం మొదలుపెట్టారు. నిజానికి అక్కడలా చేయడం వెనుక కారణం అతిథికి ఇవ్వాల్సిన కనీస మర్యాద. అది సంస్కారం. వచ్చేది ఎవరైనా కావొచ్చు. ఎదురెళ్లి స్వాగతం చెప్పడం బాధ్యత. బాలయ్య నెరవేర్చింది అదే. అంతే తప్ప వెయిట్ చేయడమంటే ఏదో అవమానం కింద భావించి కాదు. ఈ మాత్రం సగటు పరిణితి ఆలోచన లేనివాళ్లను ఫ్యాన్స్ ఎలా అంటారు

ఇవన్నీ బాలయ్య పవన్ లకు చేరినా చేరకపోయినా వాళ్ళ మీద పడే ప్రభావం ఏమీ ఉండదు కానీ ఇలా చేతిలో ట్విట్టర్ ఉంది కదాని అనవసరమైన మాటలు ట్రోల్స్ చేయడం వల్ల ఇతరులు ప్రేరేపితం చెందితే అది ఇంకోరకంగా దారి తీయొచ్చు. పవన్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉండొచ్చు ఎలాంటి టాపిక్స్ చర్చలోకి వచ్చాయనే ఆసక్తికరమైన ట్వీట్లు చేయడం బాగుంటుంది కానీ ఇలా రెచ్చగొట్టే ధోరణి ఆన్ లైన్ అయినా ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. హీరోలకున్న సంస్కారం ఫ్యాన్స్ కూ ఉన్నప్పుడే వాళ్ళను అభిమానించడంలో అర్థం పరమార్థం ఉంటుంది. అంతే తప్ప ఎగతాళి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే మిగిలేది శునకానందమే

ADVERTISEMENT
Latest Stories