
ట్రంప్ ఆంక్షలు, సుంకాలు, వీసా ఫీజుల పుణ్యమాని ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాయి. ట్రంప్ చివరికి విదేశీ విద్యార్ధులను, విదేశీ సినిమాలను కూడా విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి, దేశానికే పెద్ద కష్టమొచ్చిపడింది.
ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన రెండు కీలక బిల్లులు సెనేట్‌లో ఆమోదం పొందకపోవడంతో భారత్ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి అమెరికాలో ‘షట్ డౌన్’ ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగా దేశ రక్షణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వైద్యం, పోలీసులు వంటి అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన సాధారణ సర్వీసులలో పనిచేసే సుమారు 6-7 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, మరికొన్ని లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా సెలవులో పంపించేస్తారు.
కనుక ఆయా ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలన్నీ మూతపడతాయి. పౌర సేవలన్నీ నిలిచిపోతాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే పార్కులు, లైబ్రేరీలు, మ్యూజియంలు వంటివి ఇప్పటికే మూసివేశారు.
ఇదివరకు అంటే 2018లో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇలాగే అమెరికా 35 రోజుల పాటు ‘షట్ డౌన్’ అయ్యింది. దీని వలన అమెరికాకు మొత్తం 14 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడే మరోసారి ‘షట్ డౌన్’ అయ్యింది.
1981 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు అమెరికా ‘షట్ డౌన్’ అయ్యింది. . ఈసారి ఈ ‘షట్ డౌన్’ ఎన్ని రోజులు సాగుతుందో తెలీదు కానీ ఎక్కువ రోజులు కొనసాగితే అమెరికాకు భారీ నష్టం తప్పకపోవచ్చు.
Ranabaali marks the second collaboration between director Rahul Sankrityan and Vijay Deverakonda. Set against a…
It has been more than a couple of years since the formation of the NDA…