Telugu

ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈసారి వైసీపీకి షాక్ తప్పదా?

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లున్నాయి. వాటిలో చాలా వరకు టిడిపిదే పైచేయిగా ఉండేది. కానీ గత ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇద్దామనుకోవడంతో శ్రీకాకుళంలో 2, విశాఖలో 4 సీట్లు మాత్రమే టిడిపికి దక్కాయి. విజయనగరం జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అంటే 34 స్థానాలలో కేవలం 6 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగిందన్న మాట!

ADVERTISEMENT

కానీ ఈ మూడేళ్ళ జగన్ పాలనను రుచి చూసిన ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రజలు మళ్ళీ టిడిపివైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు తమ ఎమ్మెల్యేలకు మొర పెట్టుకొన్నప్పటికీ వారు పట్టించుకోకపోగా దురుసుగా వ్యవహరిస్తుండటం, ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించి వారి సమస్యలపై బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంతో ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టడంతో ప్రజలు టిడిపివైపు మొగ్గు చూపడం మొదలుపెట్టినట్లు సర్వేలో తేలింది.

కనుక ఈసారి 34 స్థానాలకు కనీసం 20-21 స్థానాలలో టిడిపి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కనుక ఇప్పుడు టిడిపి నేతలు చేయవలసిందల్లా ఈ పరిస్థితిని మరింత అనుకూలంగా మలుచుకొనేందుకు నిత్యం ప్రజల మద్యే ఉంటూ వారికి మరింత చేరువు అయ్యేందుకు ప్రయత్నించడమే.

ఇప్పటికే టిడిపి నేతలు ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించకుండా అడ్డుపడుతోందని చెప్పవచ్చు. కానీ టిడిపిని అడ్డుకొనే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు కూడా ప్రజలలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తున్న విషయం వైసీపీ నేతలు గమనించలేదు కానీ టిడిపి నేతలు బాగానే గ్రహించారని చెప్పవచ్చు. అందుకే అన్నా క్యాంటీన్లను మరింత పట్టుదలగా నిర్వహిస్తున్నారు.

2014లో టిడిపి ప్రభంజనం వస్తే, 2019లో వైసీపీ గాలి వీచింది. రాష్ట్రంలో క్రమంగా మారుతున్న రాజకీయ వాతావరణం, ప్రజల ఆలోచనలో మార్పును చూస్తుంటే 2024 ఎన్నికలలో మళ్ళీ టిడిపి ప్రభంజనం తప్పదనిపిస్తోంది. అదే అనుక జరిగితే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలలో 34 సీట్లలో 25-30 సీట్లు టిడిపియే గెలుచుకొన్నా ఆశ్చర్యం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jagan’s Double Standards on Election Reforms

YS Jagan Mohan Reddy’s latest statements have raised questions about his political consistency. The YSRCP…

34 minutes ago

పుంగనూరులో అంత హడావుడి చేసి ఇప్పుడు తూచ్ అంటే ఎలా?

ఇటీవల పుంగనూరులో నామినేషన్స్‌ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ…

40 minutes ago