Telugu

సినిమా కోసమే భూమ్మీదకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

తెలుగు సినిమాలలో కమెడియన్ గా వేషాలు వేసిన ప్రముఖ నటుడు ఉత్తేజ్, స్వతహాగా రచయిత అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా… తన అనుభవాలను ఓ మీడియా ఛానల్ తో పంచుకున్నారు ఉత్తేజ్. తన గురువు గారితోనే ప్రారంభించిన ఉత్తేజ్… “దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తనకు ఎంతో గౌరవమని, సినిమా కోసమే ఈ భూమి మీదకు వచ్చిన వ్యక్తి వర్మ అని, సినిమాలు చేసుకుని వెళ్లిపోతాడని” అన్నారు.

వర్మ గతంలో ఒకసారి సినిమాకు వెళ్లిన సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ… సంగీత్ థియేటర్లో ఇంగ్లీషు సినిమా చూసేందుకు వర్మ వెళ్లారు. అప్పట్లో, థియేటర్ బయట ఉండే బాక్స్ లో సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఉండేవి. ఆ బాక్స్ లో ఇంటర్వెల్ వరకు, ఆ తర్వాత సెకండాఫ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు వేర్వేరుగా ఉండేవి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేందుకు ఆ ఫొటోలను పెట్టేవారు. అదే విధంగా, రాము గారు వెళ్లిన ఇంగ్లీషు సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి.

ADVERTISEMENT

ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన వర్మ, ఆ ఫొటోలను చూసి ఇంటర్వెల్ తర్వాత ఆ సినిమా అంత గొప్పగా ఉండదని భావించి, తన స్కూటర్ పై ఒక్కరే ఇంటికి వెళ్లిపోయారు. తీరా… ఇంటికి వెళ్లిన తర్వాత… ఇంట్లో వాళ్లు ప్రశ్నించిన తర్వాత ఆయనకు అసలు విషయం గుర్తుకు వచ్చింది… తన భార్యను థియేటర్లోనే వదిలేసి వచ్చానని! ఆ తర్వాత, రాము గారి భార్య ఆటోలో ఇంటికి వచ్చారు… అని చెబుతూ ఉత్తేజ్ పగలబడి నవ్వాడు. ఒక సినిమా కోసం అంతగా ఆలోచించే వ్యక్తి అని తన గురువు గారైన వర్మను పొగడ్తలతో ముంచెత్తారు ఉత్తేజ్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Chakkora Teaser: Mass Poetry Packed With Love and Madness

The teaser of Chakkora - Lunar Love Bird has been released, offering a mix of…

22 minutes ago

Right Move At Right Time: TDP Reaches 1 Cr Homes!

One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…

43 minutes ago