పోలీసు కస్టడీలో ఉయ్యాలవాడ వంశీకులు

UYYALAWADA NARASIMHA REDDY  heirs arrested హైదరాబాద్ పోలీసులు ఉయ్యాలవాడ వంశీకులను కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి నిరసన తెలియజేశారు. వారు చెప్పినదాని ప్రకారం ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి ఐదు కోట్లు ఇప్పిస్తామంటూ అగ్రిమెంట్‌ చేసి నోటరీ కూడా చేసి ఇప్పుడు మోసం చేస్తున్నారు.

గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని తేల్చిచెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు తమకు న్యాయం చేయకపోవడంతో తాము రాంచరణ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. అప్పట్లో సంస్థ తరపున తమతో మాట్లాడిన రాష్ట్ర చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, రాంచరణ్‌ పీఏ అవినాష్‌ ఇప్పుడు మొహం చాటేశారని, మీకెలాంటి హక్కులు లేవంటూ చెప్పేశాడని ఆరోపించారు.

ADVERTISEMENT

తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్‌ చేసి నోటరీ చేసినప్పుడే 15 రోజుల గడువు ఇచ్చారని దానిని పూర్తిగా విస్మరించారన్నారు. దీనిపై సైరా బృందం ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. గతంలోనే రెండు మూడు సార్లు ఉయ్యాలవాడ వంశీకులు ఈ విషయంగా నిరసన తెలిపారు. ఇది ఇలా ఉండగా మెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న
గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ADVERTISEMENT
Latest Stories