ఆంధ్ర వ్యాపారులు పచ్చి మోసగాళ్లు… తెలంగాణ మంత్రి

V Srinivas Goud comments on andhra business peopleఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దోస్తీ చేస్తున్నారు. ఉమ్మడి ప్రాజెక్టుతో సీమను సస్యశ్యామలం చేస్తామంటున్నారు. తెలంగాణలోని పెద్ద కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వారికే ఇస్తున్నారు. అయినా తెలంగాణ మంత్రులకు ఇంకా ఆంధ్ర మీద కోపం తగ్గినట్టు లేదు. ఆంధ్ర వ్యాపారులు పచ్చి మోసగాళ్లు అంటూ వ్యాఖ్యానించారు ఒక మంత్రి.

ADVERTISEMENT

వివరాల్లోకి వెళ్తే…. రిషి నీట్‌, మెడికల్‌ అకాడమీకి చెందిన విద్యార్థులు మెడిసిన్‌లో 30 సీట్లు సాధించిన సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లోని నేషనల్‌ ఫంక్షన్‌ హాల్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వాసం కలిగి ఉంటారని, ఎవరినీ మోసం చేయరని అన్నారు. నమ్ముకుంటే ప్రాణమైనా ఇస్తారన్నారు.

‘‘ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు. విద్యార్థులకు మంచి చదువు అందిస్తామని చెబుతూ మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. వారి ఊబిలో ఎవరూ పడకూడదు’’ అని మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆంధ్రాకు చెందిన కొందరు విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

విద్యను వ్యాపారం చెయ్యడం నిజమే. అందులో ఆంధ్ర వారు ఉన్నారు తెలంగాణ వారు ఉన్నారు. ఇటువంటి ఆరోపణలే తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నా మల్లారెడ్డి మీద కూడా వచ్చాయి. ఇక ఆంధ్ర ఏంటి? తెలంగాణ ఏంటి? డబ్బుకు, ఆశకు ప్రాంతీయ బేధం ఏమిటి అంటూ కొందరు సోషల్ మీడియాలో మంత్రి గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories