
చంద్రబాబు నాయుడు నేటికీ మండుటెండల్లో ప్రజల మద్య తిరుగుతుంటే, జగన్ పరదాలు కట్టించుకొని సకల సదుపాయాలు ఏర్పాటు చేసుకొని సభలు నిర్వహించుకొంటారు. మూడు దశాబ్ధాల ముందే చంద్రబాబు నాయుడు ఐటి రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి సంపద సృష్టించవచ్చని నిరూపించారు. కానీ మూడున్నరేళ్ళలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క ఐటి కంపెనీని తీసుకురాలేకపోగా ఉన్నవాటిని తరిమేశారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాలకు దారి చూపిస్తే, జగన్ యువతకు భవిష్యత్ లేకుండా చేసేశారు.
చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొంటే హైదరాబాద్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఐటి కంపెనీలు గుర్తుకు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డిని తలుచుకొంటే చంచల్గూడ జైలు, సైకో పాలన, సైకో వ్యవహారాలే గుర్తుకొస్తాయి. కనీసం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణ పనులను, 75-85% పూర్తయిన టిడ్కో ఇళ్లను కూడా జగన్ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రాష్ట్రాన్ని అప్పులలో ముంచేస్తూ దివాళా తీయించేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పేరు తలుచుకొనేందుకు కూడా అర్హత లేదు,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరానికి ఐటి కంపెనీలు తీసుకువచ్చారని, వాటితోనే నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని, అవే రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా నిలుస్తున్నాయని కేసీఆర్ తదితరులు బహిరంగంగా అంగీకరించనప్పటికీ వాస్తవం అదేనని వారికీ తెలుసు. కనుక వారు కూడా చంద్రబాబు నాయుడు చూపిన ఆ మార్గంలోనే ముందుకు దూసుకుపోతూ హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే నంబర్: 1 స్థానంలో నిలుపుకొంటే, చంద్రబాబు నాయుడు వడ్డించిన విస్తరిలా అమరావతిని చేతికి అందిస్తే జగన్ ప్రభుత్వం దానిని కాలదన్నుకోవడాన్ని ఏమనుకోవాలి?
ఇది కేవలం పొరపాటయితే సరిదిద్దుకోవచ్చు కానీ మూడు రాజధానులనే తప్పుడు నిర్ణయాన్ని గుడ్డిగా పట్టుకొని వ్రేలాడుతుండటాన్ని ఏమనుకోవాలి?మన కళ్లెదుటే ఏపీ తెలంగాణ రాష్ట్రాలున్నాయి. పాలకుల ఆలోచనలు సరైనవైతే తెలంగాణలా అభివృద్ధి చెందుతుంది కాకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలాగ మిగిలిపోతుందని చెపుతున్నాయిగా?
The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…