నా సినిమాకి ఉండాల్సినంత బజ్ లేదు, రిలీజ్ తర్వాత మౌత్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ఎంతో హాన్సెట్ గా ఒప్పుకున్నాడు వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజు అనే సినిమా విడుదలవుతున్నట్లు ఇంకా జనాల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. వరుణ్ అన్నట్లుగానే ఈ సినిమాకి ఓపెనింగ్స్ రావడం కష్టమే.
అయితే.. ఇంచుమించుగా వరుణ్ తేజ్ స్టేజ్ లోనే ఉన్న గాంధీ మాత్రం “కొరియన్ కనకరాజు” కంటెంట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హారర్ కామెడీల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అయినటువంటి కాంచన రేంజ్ లోనే కనకరాజు కూడా ఉంటాడని నమ్మకంగా ఉన్నాడు గాంధీ.
అందుకు కారణం సత్య మరియు సత్య కామెడీ టైమింగ్. వరుణ్ & రితిక కాంబినేషన్ లో సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయిందని, కొన్ని ఎపిసోడ్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయని గాంధీ ఒకటికి పదిసార్లు బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.
డీసెంట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగి కేవలం 12 కోట్ల బ్రేకీవెన్ టార్గెట్ తో ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కొరియన్ కనకరాజుకి డిసెంట్ టాక్ వచ్చినా.. హిట్ అయిపోయే అవకాశం ఉంది.
మరి హిట్ చాలా అవసరం ఉన్న వరుణ్ తేజ్ ని గాంధీ గట్టెక్కిస్తాడా? లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది.




