
సరే రానా నాయుడు ఎలా ఉంటుందనేది తర్వాత తెలుస్తుంది కానీ ట్రైలర్ వచ్చి ఇన్ని రోజులవుతున్నా అదేమీ టాక్ అఫ్ ది ఆడియన్స్ గా మారలేదు. అయితే సాధారణ ప్రేక్షకులు దీని పట్ల విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో లేరని అర్థమవుతోంది. ట్రైలర్ చూశాక అందులో ఉన్న బోల్డ్ సీన్లు, కాస్త డోస్ ఎక్కువగా అనిపించే డైలాగులు గట్టిగానే దట్టించారని తెలిసిపోయింది. ఇది ఒరిజినల్ హిందీ సిరీస్. తెలుగులో కేవలం డబ్బింగ్ మాత్రమే చేస్తున్నారు. రెండు భాషల్లో విడివిడిగా తీయలేదు. లిప్ సింక్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది.
ఇక్కడ ప్రశ్నలు అనడం వెనుక కారణం ఉంది. వెంకటేష్ చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో. కుటుంబాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే బొబ్బలిరాజా, కూలి నెంబర్ వన్, టూ టౌన్ రౌడీ లాంటివి ఎంత మాస్ ఇమేజ్ తెచ్చినా కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, రాజా, వసంతం లాంటి సక్సెస్ లు చూశాక తనను అంతగా ఇష్టపడే ఫ్యామిలీస్ ని మెప్పించేందుకే ఎక్కువ కట్టుబడ్డారు. దృశ్యంలో ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించడానికి కారణం కూడా అదే. చిరు బాలయ్యలు మాస్ బ్యాచ్ కాబట్టి ఆ ఇద్దరినీ మినహాయిస్తే నాగార్జున చేసిన రొమాంటిక్ ఎంటర్ టైనర్లు ఎక్కువే కాబట్టి క్లీన్ మూవీస్ తో సిల్వర్ జూబ్లీకు కొట్టడం వెంకీ వల్లే అయ్యింది.
వీళ్ళ సమకాలీకుడు అయిన వెంకటేష్ ఒకరే మాస్ కంటే ఎక్కువ క్లాస్ కు దగ్గరయ్యారు. మరి ఈ వయసులో రానా నాయుడు లాంటి రఫ్ అండ్ టఫ్ కథతో అందులోనూ నెగటివ్ షేడ్స్ ని మోస్తూ ఎలా మెప్పిస్తారనేది వేయి డాలర్ల క్వశ్చన్. ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నడూ చేయని ప్రయత్నం కాబట్టి ఆయనకు కొత్తగా ఉండొచ్చు .కానీ అదే స్థాయిలో తన మీద మంచి సదభిప్రాయం ఉన్న ఆడియెన్సూ అనుకోవాలి. ఈ జడ్జ్ మెంట్ ఎంతవరకు సరైనదో మార్చి 10న తేలిపోతుంది కానీ సమాధానం దొరికే దాకా ఇది సస్పెన్స్ గానే ఉండబోతోంది.
అమెరికా మాజీ అధ్యక్షులుగా చేసిన అబ్రహం లింకన్ వంటివారు ఆ పదవికి ఎంతో వన్నె తెస్తే, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష…
The TDP, despite being the ruling party in Andhra Pradesh, has agreed to share a…