
ఈ నెల 24వ తేదీన మారుతీ – విక్టరీ వెంకటేష్ ల “బాబు బంగారం” ఆడియో విడుదల అవుతుండగా, ఆగష్టు 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నామని మారుతీ ప్రకటించారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా ఒక పది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండగ వాతావరణం ప్రారంభం కానున్న నేపధ్యంలో… ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… ‘బాబు బంగారం’ బాక్సాఫీస్ వద్ద నిజంగానే నిర్మాత జీవితాన్ని బంగారుమయం చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్లు సినిమాపై ఓ మంచి అభిప్రాయాన్ని ప్రేక్షకులలో కలుగజేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ‘బాబు బంగారం’ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్ లో మాంచి పట్టు ఉన్న వెంకటేష్ సినిమా విడుదలకు ‘సూపర్ డేట్’ లభించిందన్నది ముక్తకంఠంతో చెప్తున్న మాట. ‘బుడ్డోడు’ మిస్సయినా, ‘పెద్దోడు’ మాత్రం మిస్ కాకపోవడంతో ధియేటర్ల వద్ద ఈ ‘బాబు’ పండగకు కొదవలేదు అంటున్నాయి సినీ వర్గాలు.
The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…