‘బ్రేక్’ ఇవ్వడానికి ‘ఆడియన్స్’ రెడీనే!

Trailer Talk: A Gripping Adaptation Of Sensational Sequelఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగు సినిమాలకు పెద్దగా కలిసి వచ్చినట్లు లేదు. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి సినిమాలు కాస్త పేరును తెచ్చుకున్నాయి గానీ, ప్రముఖ హీరోలు నటించిన మూవీస్ మాత్రం ఓటీటీలో తుస్సుమనిపించాయి. “వి, నారప్ప, టక్ జగదీష్” వంటి మూవీస్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం కాగా, నితిన్ ‘మాస్ట్రో’ పాస్ మార్క్ లు వేయించుకుంది.

కానీ ఈ సారి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న “దృశ్యం 2” సినిమాకు బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ సిద్దమనే నమ్మకాన్ని ధియేటిరికల్ ట్రైలర్ కలిగించింది. ‘దృశ్యం’కు కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సినిమాలో ఏం చూపించబోతున్నారో అన్న విషయాన్ని చెప్తూనే, రాంబాబుగా వెంకీ మళ్ళీ ఏ విధంగా తప్పించుకుంటారు అన్న సస్పెన్స్ ను కలిగించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

ADVERTISEMENT

ఈ నెల 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ రెండు పార్టులకు అలాగే, విక్టరీ వెంకటేష్ మొదటి పార్ట్ కు కూడా జీతూనే దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT
Latest Stories