రిలీజ్ లలోనే కాదు ప్రమోషన్ల లో కూడా పోటీనేనా..?

Venkatesh-Saindhav-Promotions-Vizag

ఆదివారం సాయంత్రం అటు ఘట్టమనేని, ఇటు దగ్గుపాటి అభిమానానులతో పాటుగా కంటెంట్ ఉంటే స్టార్లతో పనిలేదు అని నమ్మి సినిమాను ఆదరించే సాధారణ సినీ ప్రేమికులకు కావలిసినంత సినీ సందడి షురూ చేసింది టాలీవుడ్.

ADVERTISEMENT

ప్రీ రిలీజ్ ఈవెంటుతో విశాఖ ప్రజలను పలకరించారు సైంధవ్ చిత్ర యూనిట్. తన 75 మూవీ గురించి చెపుతూ తనకు విశాఖకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు వెంకటేష్. పవన్ తో కలిసి గోపాల గోపాల సినిమాకు ఇక్కడికి వచ్చా, అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాతో మహేష్ తో కలిసి వచ్చా, పెళ్లి కానీ ప్రసాద్ గా ఇక్కడే తిరిగా అంటూ విశాఖ వాసులకు గత జ్ఞాపకాలను తట్టిలేపారు.

వెంకటేష్ గత సినిమాల మాదిరి కాకుండా నయా ట్రెండ్ కు తగ్గట్టుగా సైంధవ్ ప్రమోషన్లు ప్లాన్ చేశారు. స్టేజి మీద సైంధవ్ ట్రైలర్ లో డైలాగ్స్ చెపుతూ వెంకటేష్ తన అభిమానులను ఆకట్టుకున్నారు. జనవరి 13 న రానున్నసైంధవ్ ప్రమోషన్లతో దూసుకుపోతుంది. అలాగే ఇప్పటి వరకు అసలు ప్రమోషన్లను మొదలుపెట్టని గుంటూరు కారం సినిమా ట్రైలర్ లాంచ్ తో మహేష్ తన అభిమానులకు “రమణ గాడిని” పరిచయం చేసారు.ట్రైలర్ కు మిక్సడ్ టాక్ రావడంతో సినిమా పై బారి ఆశలు పెట్టుకున్న మహేష్ అభిమానులకు మాత్రం పండగ కాదు టెన్షన్ నాలుగు రోజుల ముందే మొదలయ్యింది.

అలాగే స్టార్ హీరోల మీద నమ్మకంతో కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న కథ మీద ఉన్న నమ్మకంతో తమ సినిమాకు రావాలంటూ తమ కథనే హీరోగా ప్రమోట్ చేస్తున్న “హనుమాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైద్రాబాద్ లో జరిగింది. సినిమా ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది హనుమాన్.సినిమాలో స్టార్ హీరో లేకపోయినా సినిమా ప్రమోషన్ కు మెగా స్టార్ వచ్చినందుకు కృతఙ్ఞతలు అంటూ హనుమాన్ చిత్ర యూనిట్ చిరుకి అభినందనలు తెలిపారు.

కథలో విషయం ఉంటే సంక్రాతి సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటిని రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అంటూ చిరు శతమానంభవతి సినిమా విజయాన్ని గుర్తుచేశారు.జనవరి 12 మహేష్ తో పోటీగా కాకుండా మహేష్ తో కలిసి వస్తున్నాం అంటూ చెపుతున్న హనుమాన్ కి ప్రేక్షకులలో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇలా సినిమాల రిలీజింగ్ లోనే కాదు ప్రమోషన్ల ఈవెంట్లలో కూడా పోటీనా అన్నట్లుగా జనవరి 7 న మూడు సినిమాలు ఈవెంట్లు జరిగినాయి.

ADVERTISEMENT
Latest Stories