విజయ్ దేవరకొండ కృషి ఫలితం?

Vijay Deverakonda - Anand Deverakonda-pushpaka vimanamయూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ పేరు ప్రస్తుతం ఒక ‘బ్రాండ్’లా మారింది. ఆ బ్రాండ్ తోనే తన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన “పుష్పక విమానం” సినిమా పబ్లిసిటీ అంతా తన భుజస్కందాల పైన వేసుకుని ప్రమోషన్ చేసాడు. దీంతో యూత్ లో ఒక విధమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ‘పుష్పక విమానం’ నేడు సిల్వర్ స్క్రీన్ తలుపు తట్టింది. మరి విమానం ఆశించిన విధంగా టేక్ ఆఫ్ అయ్యిందా? అంటే…

ADVERTISEMENT

తొలి టాక్ ప్రకారం అంత ఆశాజనకంగా లేదని వినపడుతోంది. ఒక సింపుల్ లైన్ తో కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కించిన విధానంలో… ఫస్ట్ హాఫ్ సోసో… గా ఉన్నా, సెకండాఫ్ నిడివి ఎక్కువగా ఉండి ప్రేక్షకుల సహనాన్ని కాసింత పరీక్ష పెట్టే విధంగా ఉందన్నది ఫస్ట్ టాక్. విడుదల ముందు వరకు జరిగిన ప్రమోషన్స్ తో టేక్ ఆఫ్ వరకు బాగానే వచ్చిన ఈ ‘విమానం’ గాలిలో ఎన్నాళ్ళు ఎగురుతుందన్న ప్రశ్న మాత్రం తలెత్తక మానదు.

ఆనంద్ దేవరకొండ నటించిన గత చిత్రం “మిడిల్ క్లాస్ మెలోడీస్” నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. దీంతో ‘పుష్పక విమానం’తో వెండితెరపై కూడా సక్సెస్ అందుకోవాలన్న తలంపుతో చేసిన ప్రయత్నం యొక్క బాక్సాఫీస్ లెక్కలు తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి. విజయ్ దేవరకొండ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దోహదమే “పుష్పక విమానం”కు కొండత అండ?!

ADVERTISEMENT
Latest Stories