‘గీత గోవిందం’ సినిమాతో టాలీవుడ్ లోకి కొత్త స్టార్ హీరో అవతరించిన విషయం తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ లైఫ్ టైం కలెక్షన్స్ ను ఒక్క వారం లోపునే క్రాస్ చేసి, తన కెరీర్ బెస్ట్ అందుకోవడమే కాక, సెకండ్ లీగ్ హీరోల కలెక్షన్స్ లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకోవడంతో, విజయ్ దేవరకొండ పేరు మారుమ్రోగుతోంది. అందుకే ఇప్పుడు అభిమానులు ఆయనను ముద్దుగా “సూపర్ పవర్ స్టార్” అంటూ పిలుచుకుంటున్నారు.
[m9ad]
మరి ఈ ట్యాగ్ లైన్ పై విజయ్ ఏమనుకుంటున్నారో తెలుసా? మహిళమణులు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడుగగా… “ఇప్పుడు నేనేం చెప్పాలి… ఒకవేళ మీరు ఏదన్నా నేను విజయ్ దేవరకొండలానే ఉంటాను, ఆ ట్యాగ్ లైన్స్ నన్నేమీ ప్రభావితం చేయలేవు, కానీ చల్తా…” అంటూ సూపర్ పవర్ స్టార్ బిరుదుపై స్పందించారు. కానీ ఇది మీరు అంగీకరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అభిమానులు కోరుకున్నారు.
ఈ సినిమా ఇంత బంపర్ హిట్ కావడంతో, ఆటోమాటిక్ గా దీని ప్రభావం తదుపరి సినిమాలపై ఉంటుందని, కానీ ఇప్పటికే నాలుగైదు సినిమాలను తాను అంగీకరించానని, అవన్నీ కొత్త డైరెక్టర్లతోనే కొత్తగా ఉంటాయని, తనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ తన జాబ్ చేసుకుంటానని, అవి ప్రేక్షకులు అంగీకరిస్తే చాలని, అంతకుమించిన ‘స్టార్’ గుర్తింపు ఏమీ ఉండదని విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.



