Telugu

విజయ్ దేవరకొండ ‘మిస్టరీ’ వీడింది!

ట్రోల్స్ ను కూడా పాజిటివ్ గా చేసుకున్న ఘనత విజయ్ దేవరకొండ సొంతం. అలాంటి విజయ్ దేవరకొండ, తాను 10వ క్లాస్ లో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం వెనుక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీళ్ళందరికీ ఈ ఫోటో ఎలా దొరికిందో అంటూ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, నెటిజన్ల టైమింగ్ ను, ట్రోల్స్ ను మెచ్చుకున్న విషయం తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

అయితే 10వ తరగతిలో విజయ్ దేవరకొండ ఫోటో ఫోటో ఎలా బయటకు వచ్చిందో అన్న మిస్టరీపై తాజాగా స్పష్టత వచ్చింది. విజయ్ దేవరకొండ చదువుకున్న సత్య యూనివర్సిటీలో చదువుకున్న ఓ అమ్మాయి, ప్రస్తుతం ఓ వెబ్ మీడియాలో విధులు నిర్వహిస్తుండగా, ఆ అమ్మాయికి సీనియర్ మరియు విజయ్ దేవరకొండ క్లాస్ మెట్ అయిన సాయి మనోహర్ ద్వారా ఈ ఫోటో బయటకు వచ్చిందన్న విషయం తేలింది.

దీంతో ఈ మిస్టరీ వీడిందంటూ విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేసారు. అసలు ఈ ఫోటో ఎలా వచ్చిందంటూ ప్రతి దగ్గర తాను ఎంక్వయిరీ చేశాను, ఈ రోజు మొత్తానికి దీనికి జవాబు లభించింది అంటూ చిరునవ్వులు చిందించాడు. స్కూల్ లో డ్రామాలు చేసేవాడిని గానీ, సీరియస్ గా నటుడిని అవ్వాలని మాత్రం అనుకోలేదని, ఎలానో ఇలా నటుడిగా అయ్యానని తన ఫ్లాష్ బ్యాక్ విశేషాలు చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తీరం దాటిన అర్నాబ్….సహాయక చర్యలు మొదలు

అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…

2 minutes ago

చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఇది కాదేమో….

చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…

6 minutes ago