బన్నీని పక్కన పెట్టి, విజయ్ దోచేసాడు!

vijay-deverakonda - allu arjun-ఓ స్టార్ హీరోను పక్కన పెట్టుకుని, ఆయనను మించిపోయే విధంగా ప్రేక్షకులను ఆకర్షించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ విజయ్ తన యాటిట్యూడ్ తో దానిని అవలీలగా సాధించాడు. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా “గీత గోవిందం” ఆడియో వేడుక జరుగగా, ఈ వేడుకలో బన్నీ కంటే విజయ్ దేవరకొండ హైలైట్ గా నిలవడం విశేషం.

[m9ad]

ADVERTISEMENT

తాను పాడిన పాటపై సోషల్ మీడియాలో వచ్చిన స్పందనలు చూపించి వేడుకకే హైలైట్ గా నిలిచాడు విజయ్. ముందుగా కాస్ట్యూమ్స్ విషయంలోనే గళ్ళ లుంగీ కట్టుకుని వచ్చి తనదైన ప్రత్యేకతను చాటుకున్న విజయ్, మైక్ పట్టుకున్నప్పుడల్లా వీక్షకులను అలరించాడు. అంతేకాదు తనను ట్రోల్ చేసిన వారికి మరొక బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించారు.

తాను పాడిన పాటను మీరు మళ్ళీ పాడి తనకు పంపిస్తే, అది తానూ పాడిన దాని కంటే బాగుంటే గనుక, మీ వర్షన్ నే సినిమాలో పెడతామని విజయ్ ప్రకటించి, “గీత గోవిందం” సినిమాకు కావల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టాడు. తాను మారిపోయాను… నిజంగా మారిపోయాను… అంటూ ‘అర్జున్ రెడ్డి’ మార్క్ ను తనపై పడకుండా చూసే ప్రయత్నం చేసాడు.

విజయ్ ఏం మాట్లాడతాడో అన్న ఆసక్తి ఈ వేడుక ముందు ప్రేక్షకులలో నెలకొనగా, అసలేం ప్రిపేర్ అయ్యారోనని అల్లు అరవింద్ తో సహా చిత్ర యూనిట్ విజయ్ కు ఫోన్ చేసారంటే, అతని క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా స్వయంగా విజయ్ నే స్టేజ్ పైన ప్రస్తావించి అక్కడున్న వారిని, ఆడియో వేడుకను సక్సెస్ చేసాడు.
vijay-deverakonda - allu arjun-

ADVERTISEMENT
Latest Stories